ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ఉదయం నుండి అదే హడావుడి నడుస్తుంది. ఇక పవన్ సినిమాల నుండి కూడా బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. నిజానికి మూడు అప్ డేట్స్ మాత్రమే వస్తాయనుకున్నారు కానీ బోనస్ గా నాలుగో అప్ డేట్ కూడా వచ్చింది అదే సురేందర్ రెడ్డితో సినిమా. ఈ సినిమా ను కూడా అధికారికంగా ప్రకటించారు ఈరోజు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు పవన్ కు సన్నిహితుడైన రామ్ తళ్లూరి ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా అలా సినిమా కన్ఫామ్ అయిందో లేదో అప్పుడే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. ఈసినిమా లాంచింగ్ డేట్ ను అప్పుడే ఫిక్స్ చేసేసారట. దసరా పండుగ రోజు ఈ సినిమాను లాంచ్ చేయనున్నారట. అంటే అక్టోబర్ చివరి వారంలో అన్నమాట. మిగిలిన వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ఉదయం వకీల్ సాబ్ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. క్రిష్ సినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక హరీష్ శంకర్ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: