#PSPK29 – సురేందర్ రెడ్డితో కన్ఫామ్

Director Surender Reddy Confirms His Next With Power Star Pawan Kalyan

రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వేణు శ్రీరామ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో.. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. ఇక పవన్ 29 సినిమాపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొన్ని సార్లు.. డాలీ దర్శకత్వంలో అని కొన్ని సార్లు వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కి కూడా బ్రేక్ వేస్తూ ఈ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ పవన్ 29వ సినిమా అప్ డేట్ కూడా ఇచ్చేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్ 29వ సినిమా సురేందర్ రెడ్డి తోనే చేయనున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

 

ఇక ఇప్పటికే పవన్ పుట్టిన రోజు సందర్భంగా వకీల్ సాబ్ నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =