ఫైనల్లీ పవన్ నాలుగో అప్ డేట్ కూడా వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి కూడా సర్ ప్రయిజ్ ఉన్నట్టు నిన్ననే తెలిపారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో స్టైలిష్ బైక్ కనిపిస్తుండగా..దానిపై పెద్ద బాలశిక్ష పుస్తకం..బ్యాక్ డ్రాప్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ చిత్రాలు కనిపిస్తూ దేశభక్తిని స్మృశించేలా ఉంది. హరీష్ శంకర్ కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేస్తుంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి పవన్ సినిమాలు చేసినప్పుడు కూడా ఇలా వరుస సినిమాలు చేసింది లేదు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దూకుడు పెంచాడు. అందుకే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈరోజు పుట్టిన రోజు కావడంతో ఆ సినిమాల అప్ డేట్స్ కూడా ఇస్తూ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తారు దర్శకనిర్మాతలు.
The Blockbuster combo is Back 💥
Here’s the concept poster of #PSPK28 and this time, it’s not just Entertainment 😎
POWER STAR @PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose ❤️ pic.twitter.com/z2Pz7FHYTH
— Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2020
కాగా ప్రస్తుతం వేణు శ్రీరామ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు పవన్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో.. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇక ఈ రోజే సురేందర్ రెడ్డి తో సినిమా కూడా కన్ఫామ్ అయింది. మరి ఈ సినిమాలు అన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: