అప్పట్లో.. బాలకృష్ణ సినిమా కోసం చిరు ప్రచారం

Did You Know Megastar Chiranjeevi Did Movie Promotion For Nandamuri Balakrishna Science Fiction Movie Aditya 369 ?

ఇప్పుడు ఒక హీరో సినిమా ప్రమోషన్స్ కు మరొక హీరో రావడం కామన్ అయిపోయింది. అందుకు కారణం అప్పటి సినీ పరిశ్రమలో.. ఇప్పటి సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి కాబట్టి. అప్పట్లో ఈ ప్రమోషన్స్ అవి ఇవి అంటూ అంత హడావుడి ఉండేది కాదు. సినిమా షూటింగ్ చేశామా.. కష్టపడ్డామా.. సినిమా రిలీజ్ అయ్యిందా.. అదేంటో మరి అప్పుడు ఎలాంటి ప్రచారాలు లేకపోయినా ప్రతి సినిమా దాదాపు హిట్టయ్యేది. ప్లాప్స్ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేయడం కూడా తక్కువే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే అప్పట్లో బాలకృష్ణ ఒక సినిమాను మాత్రం చిరు ప్రమోట్ చేశారు. ఆసినిమా ఏదో కాదు ఆదిత్య 369. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఒకపుడు గట్టి పోటీ ఉండేది. సినిమాల పరంగా పోటీ పడే వీళ్లిద్దరు వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే ఆదిత్య 369 కు ప్రచారం చేసారు. 1991 సంవత్సరం జులై 18 వ తేదీ రిలీజ్ అయింది ఆదిత్య 369. ఈ సినిమా రిలీజైన తర్వాత మరింత పబ్లిసిటీ కల్పించడానికిీ, పిల్లలను , కుటుంబ ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ దూర్‌దర్శన్‌లో యాడ్స్ వేయాలని ప్లాన్ చేసారట. అయితే చిరు తో ప్రచారం చేయిస్తే ఇంకా బావుంటుందని భావించి చిరు ని అడిగారట. చిరు కూడా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నారట. దూర దర్శన్ లో ట్రైలర్ ద్వారా ఈ సినిమా ప్రమోట్ చేశాడట చిరు.

సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాలకు పెట్టింది పేరు. ఆయన చేసిన ఎన్నో ప్రయోగాల్లో ఒకటే ఆదిత్య 369. టైమ్‌ మెషీన్ బ్యాక్ డ్రాప్ తో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమాగా బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనూ మైలు రాయిగా నిలిచింది. టైమ్ మిషన్, శ్రీ కృష్ణ దేవరాయలు కాలం సెట్టింగ్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. హీరో బాలకృష్ణ.. కృష్ణ కుమార్, కృష్ణ దేవరాయలుగా ద్విపాత్రాభినయం చేయడమే కాదు… ఆరెండుపాత్రలలోనూ అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించాలని కూడా చూస్తున్నారు. గతంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని పలుమార్లు తెలిపినా అది అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు మరోసారి బాలయ్యను డైరెక్ట్ చేసి ఈ సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. మరి అప్పటిలాంటి సినిమాలు ఇప్పుడు రావడం అంటే కొంచం కష్టమైన విషయమే. వచ్చినా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియని పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 11 =