ఈ రోజు (సెప్టెంబర్ 2 ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సినీ , రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా “వకీల్ సాబ్ ” మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఆ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న “వకీల్ సాబ్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Tweet of the day! Thank you @urstrulyMahesh garu. https://t.co/pYfGfZXLsx
— Arjun Musineni (@MovieBuffff) September 2, 2020
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో మహేష్ బాబు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు మంచి విషయాలపై స్పందించి , అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ బాబు తమ ఇద్దరి ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. “హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ , మీ దయా గుణం , వినయం ఎల్లప్పుడూ కొత్త మార్పును ప్రేరేపిస్తాయని , మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా , సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: