తమ అభిమాన హీరో పుట్టిన రోజును పండుగలా జరుపుకుందామని అభిమానాలు అనుకునేలోపే అనుకోని విషాదం జరిగిపోయింది. పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే కటౌట్ కట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కు గురై సోమశేఖర్, అరుణాచలనం, రాజేంద్ర అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరి కొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇక అభిమానుల మరణ వార్త విన్న పవన్ అభిమానుల మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటనను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుండెల నిండా నా పట్ల అభిమానం నింపుకున్న కుప్పం నియోజకవర్గం జన సైనికులు శ్రీ సోమశేఖర్, శ్రీ అరుణాచలనం, శ్రీ విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శాంతి పురం దగ్గర కటౌట్ కడుతుంటే విద్యుత్ షాక్ వల్ల వాళ్ళు చనిపోయారనే వార్త నా మనసును కలిచివేసింది..ఇది మాటలకు అందని విషాదం..మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.. ఆ తల్లి తండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలను.. దూరమైన బిడ్డలను తీసుకురాలేను కనుక.. ఆ తల్లిదండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను. మృతి చెందిన అభిమానులకు ఒక్కొక్కరికీ రెండు లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించాను.. అలాగే చికిత్స పొందుతున్న హరికృష్ణ, పవన్, సుబ్రహ్మణ్యం, అరుణ్‌కు సరైన వైద్యం అందేలా చూడాలని స్థానిక నాయకులను కోరినట్లు పవన్ ప్రకటనలో తెలిపారు.
జన సైనికుల మరణం మాటలకు అందని విషాదం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/RJ5qEP498p
— JanaSena Party (@JanaSenaParty) September 1, 2020
ఈ ఘటనపై రామ్ చరణ్ కూడా స్పందిస్తూ.. నిన్న కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు యువకులు మరణించారనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మీ ఆరోగ్యం, ప్రాణం కంటే ఏది విలువైనది కాదు. మీరు ఎల్లప్పుడు ఇది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని నా మనవి. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ , వాళ్ళు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
— Ram Charan (@AlwaysRamCharan) September 2, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: