‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ రిలీజ్

Power Star Pawan Kalyan Comeback Movie Vakeel Saab Motion Poster Is Out.

మొత్తానికి పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న టైం రానే వచ్చేసింది. నిజానికి ఈ బర్త్ డే ఫ్యాన్స్ కు ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళ నుండి పుట్టినరోజులు జరుగుతున్నా ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇచ్చింది లేదు. రెండేళ్ల తర్వాత వస్తున్నా అభిమానులను ఏ మాత్రం నిరాశకు గురిచేయకుండా తను చేస్తున్న మూడు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ తో వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మొదట వకీల్ సాబ్ నుండి అప్ డేట్ వచ్చేసింది. వ‌కీల్ సాబ్‌ నుండి మోష‌న్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక మోషన్ పోస్టర్ చూస్తుంటే స్టైలిష్ వకీల్ సాబ్ గా పవన్ లుక్ అదిరిపోయింది. ఓ చేతిలో బేస్‌బాల్ స్టిక్‌, మ‌రో చేతిలో క్రిమిన‌ల్ లా అనే పుస్త‌కం ప‌ట్టుకుని ప‌వ‌న్ నిల‌బ‌డి ఉండగా ఈ లుక్ చూస్తుంటే అభిమానుల అంచనాలను మించేలా కనిపిస్తుంది. స‌త్య‌మేవ జ‌య‌తే … అనే బీట్ వస్తుండగా.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్. మొత్తానికి ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన పోస్ట‌ర్ తో ఫ్యాన్స్ దిల్ కుష్ అయిపోయారు.

ఒక అప్ డేట్ వచ్చేసింది. ఇంకా ఫ్యాన్స్ కోసం రెండు అప్ డేట్స్ రెడీ గా ఉన్నాయి. క్రిష్ సినిమా అప్ డేట్ 12.30 కి రానుండగా.. హరీష్ శంకర్ సినిమా అప్ డేట్ సాయంత్రం 4.5 నిమిషాలకు రానుంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =