మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఈరోజు. ఒక అప్ డేట్ తర్వాత మొరొకటి ఇస్తూ ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హడావుడి నడుస్తుంది. ఈ రోజు ఉదయం 9.9 నిమిషాలకు వకీల్ సాబ్ నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ ఆనందంలో ఉండగానే పవన్ 29 సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. పవన్ 29 సినిమా ముందు అనుకున్నట్టే సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే తెరకెక్కుతుంది. ఇక ఆ సంతోషంనుండి తేరుకోకముందే క్రిష్ నుండి అప్ డేట్ వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు పవన్ బర్త్డే సందర్భంగా పవన్ ప్రీ లుక్ విడుదల చేశారు దర్శకుడు క్రిష్. అంతేకాదు ఈ సినిమా కోసం పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
@PawanKalyan గారు, #PSPK27 పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది..
చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది..
ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..
ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ #HBDPawanKalyan pic.twitter.com/PCVhIO3uxm— Krish Jagarlamudi (@DirKrish) September 2, 2020
కాగా పవర్ స్టార్ తన 27వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. కొద్దిరోజులు షూటింగ్ జరుపుకోగా కరోనా వలన షూట్ కు బ్రేక్ పడింది. త్వరలో మళ్లీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: