డిప్రెషన్ లో ఉన్నప్పుడు రజినీ సినిమాలు చూస్తానంటున్న మాజీ క్రికెటర్

These Words of Former Cricketer Javagal Srinath Says How Big Fan He Is To Super Star Rajinikanth

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో అభిమానాలు వున్నారు ఆయనకు. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి కూడా ఆయనకు అభిమానులున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మలేషియా, జపాన్ లాంటి దేశాల్లో ఆయన సినిమాలు రిలీజ్ అయితే అక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేసే స్టామినా ఉన్న నటుడు రజినీకాంత్. సామాన్యులకు.. కేవలం సినిమా వాళ్ళకే కాదు ఎంతోమంది ప్రముఖులకు కూడా ఆయన జర్నీ ఒక స్ఫూర్తిదాయకం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక ప్రముఖ క్రికెటర్ కూడా తనకు రజినీకాంత్ అంటే ఎంత ఇష్టమో చెప్పినదాన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు రజినీ సత్తా ఏంటో. మాజీ ఇండియన్ క్రికెటర్.. ప్రస్తుత ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. తాజాగా ఒక టాక్ షో లో పాల్గొన్న ఆయన రజినీకాంత్ గ్రేట్ హ్యూమన్ అని.. అంత స్థాయి ఉన్న ఒదిగి వుండే మనిషని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎప్పుడైనా డిప్రెస్డ్ గా వున్నప్పుడు వెంటనే రజినీకాంత్ సినిమాలు చూస్తానని కూడా చెప్పాడు.

ఇక ఈ ఏడాది ‘దర్బార్’ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్. ప్రస్తుతం తను అజిత్‌తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నాడు. ఖుష్బూ,మీనా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో…. కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + ten =