పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : పవన్ కళ్యాణ్ బెస్ట్ మూవీ ?

Poll: Which Is Your Favorite Among These Pawan Kalyan Movies?

ఖుషి :శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్ పై ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “ఖుషి ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఖుషి “మూవీ లో ఉన్న 4 ఫైట్స్ ను పవన్ కళ్యాణ్ కంపోజ్ చేయడం విశేషం. “ఖుషి “మూవీ 8 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి
రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జల్సా : గీతా ఆర్ట్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , ఇలియానా జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “జల్సా ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ సాంగ్స్ , ఫైట్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు . దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూత లూగించాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ సంతోషం అవార్డ్ అందుకున్నారు.

గబ్బర్ సింగ్ : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. దేవిశ్రీ సంగీతం “గబ్బర్ సింగ్ “మూవీ కి హైలైట్ గా నిలిచింది. 5 సెంటర్స్ లో 200 డేస్ ప్రదర్శించబడింది.

అత్తారింటికి దారేది: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , సమంత జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “అత్తారింటికి దారేది” మూవీ విశేష ప్రేక్షకాదరణ పొంది ఘనవిజయం సాధించింది. పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకుల వీనుల విందు చేశాయి. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ “కాటమరాయుడా “సాంగ్ కు గళాన్ని అందించడం విశేషం.

[totalpoll id=”48427”]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.