కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 53

ఓటీటీ

అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు సిద్దమైన 'నిశ్శబ్దం'

మొత్తానికి ఇన్ని రోజుల సస్పెన్స్ తర్వాత నిశ్శబ్దం సినిమా రిలీజ్ పై ఒక క్లారిటీ వచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దానికితోడు ఈ కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీ లోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని అన్నారు. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ పడింది. రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్స్ లేవు కాబట్టే ఓటీటీ కే మొగ్గు చూపారు చిత్ర యూనిట్…

TFN Adminవాట్సాప్
Actor Sundeep Kishan Gives Update About His Latest Movies On Social Media
షూటింగ్ అప్‌డేట్

A1 ఎక్స్ ప్రెస్, వివాహ భోజనంబు షూటింగ్ అప్ డేట్స్

డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఇన్నిరోజులు షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. సందీప్ కిషన్ కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ కాస్త ధైర్యం చేసి షూటింగ్ లను మొదలు పెట్టాడు.

TFN Adminవాట్సాప్
Actress Rashmika Mandanna Pens An Emotional Post About Audience On Social Media
సినిమా వార్తలు

రష్మిక ఎమోషనల్ పోస్ట్

తెలుగు , కన్నడ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక నటించిన కన్నడ మూవీ "పొగరు " రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అఫీషియల్ 'మ‌హాస‌ముద్రం' లో సిద్ధార్థ్ - ఏడేళ్ల‌ తర్వాత

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజ‌య్ భూప‌తి డైరెక్షన్ లో రానున్న 'మహాసముద్రం' సినిమాపై ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. టాలెంటెడ్ నటుడు శ‌ర్వానంద్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో మరో హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఇక ఇప్పుడు దీనిపై కూడా అధికారిక ప్రకటన ఇచ్చేసారు. ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

ఉపేంద్ర 'కబ్జ' థీమ్‌ పోస్టర్‌ రిలీజ్

ఓం, ఎ, రా, హెచ్ టూ ఓ, లాంటి వైవిధ్యమైన సినిమాలు చేయాలంటే కన్నడ హీరో ఉపేంద్ర తర్వాతే ఎవరైనా. కేవలం కన్నడలోనే కాదు తెలుగులో కూడా ఉపేంద్రకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు 'కబ్జ' అనే మరో విభిన్నమైన సినిమాతో వస్తున్నాడు. 1980 ల కాలంనాటి పరిస్థితుల నేపథ్యం లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

మోదీ బయోపిక్ 'మ‌నో విరాగి' ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ ఒక్క సినీ ఇండస్ట్రీ అని కాదు..అన్ని సినీ ఇండస్ట్రీల్లోనూ బయోపిక్ ల హవా సాగుతుంది. పొలిటికల్ నేపథ్యంలో తెలుగులో ఎన్టీఆర్ మహానాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు మరికొంతమంది బయోపిక్ లు తెరకెక్కాయి.. రిలీజ్ కూడా అయ్యాయి. తమిళంలో జయలలిత బయోపిక్ కూడా రానుంది. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

స్పెషల్ డే రోజు కె.జి. ఎఫ్ 2 టీజర్..?

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి. ఎఫ్ 2 సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూసారో.. అంత లేట్ అయింది. అయితే కావాలని లేట్ చేయలేదులెండి. కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోవడం వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. మళ్లీ కొద్దిరోజుల క్రితమే షూటింగ్ ను మొదలు పెట్టారు.

TFN Adminవాట్సాప్
Actress Nivetha Thomas Shares A Dance Rehearsal Video Shot During V Movie Shooting On Social Media
షూటింగ్ అప్‌డేట్

'V' కోసం నివేద డ్యాన్స్ ప్రాక్టీస్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్ట్రెస్ లో నివేద థామస్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. ఎన్ని సినిమాలు చేశామన్నది.. ఎవరితో చేశామన్నది కాదు.. ఎలాంటి పాత్ర చేసాం.. ఆడియన్స్ కు ఎంత నచ్చింది అనేది చూసే హీరోయిన్స్ లో నివేద కూడా ఒకటి. అందుకే మొదటి నుండి అలాంటి పాత్రలే ఎన్నుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల విడుదలైన 'వి' సినిమాలో కూడా క్రైమ్ రైటర్ గా విభిన్నమైన పాత్రలో నటించి ఎప్పటిలాగే సూపర్ అనిపించుకుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు కు జోడీగా నటించగా.. వీరిద్దరి పెయిర్ కు మంచి మార్కులు పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Mega Powerstar Ram Charan Gets Back To Gym After Lockdown
సినిమా వార్తలు

హ్యాపీ గా జిమ్ కు రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 6 నెలల పాటు ఇంటికే పరిమితం అయిన రామ్ చరణ్ ఇంటిలోనే వర్కౌట్స్ చేస్తూ టైమ్ పాస్ చేశారు. ఇప్పుడు జిమ్ లు ప్రారంభం కావడంతో హీరోలు , హీరోయిన్స్ జిమ్ బాట పట్టారు. హీరో రామ్ చరణ్ కూడా జిమ్ కు వెళ్ళి వర్కౌట్స్ చేయాలని డిసైడ్ అయ్యారు.

Team TFNవాట్సాప్
Actress Raashi Khanna Shares A Sneak Peek Video Of Her Workout Session On Social Media
సినిమా వార్తలు

జిమ్ లో రాశీఖన్నా వర్కౌట్స్

తెలుగు , తమిళ భాషా చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ లో హీరోయిన్ గా నటిస్తున్న రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. రాశీఖన్నా రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఇంటిలోనే వర్కౌట్స్ చేసిన రాశీఖన్నా జిమ్ లు ప్రారంభం కావడంతో ఇప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Anupama Parameswaran Shares Her New Look On Social Media
సినిమా వార్తలు

న్యూ లుక్ లో అనుపమ పరమేశ్వరన్

సూపర్ హిట్ "ప్రేమమ్ " మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ "అ ఆ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ప్రేమమ్ ", "శతమానం భవతి ", హలో గురు ప్రేమకోసమే ", "రాక్షసుడు "వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుపమ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "కార్తికేయ 2", "18 పేజెస్ " మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయిన అనుపమ ఒక తమిళ మూవీ తోపాటు ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Director Krish Shares An Adorable Pic From Formal Meeting Of Tollywood Movie Directors
సినిమా వార్తలు

ఒకేచోట టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్

టాలీవుడ్ స్టార్ దర్శకులంతా ఒకే చోట కలిసి ఉండటం.. చిన్న పార్టీ చేసుకొని అందరూ కలిసీ తినడం చాలా అరుదుగా జరిగే విషయాలు. ఎప్పుడో ఏదైనా విషయం ఉంటే తప్పా కలుసుకునే అవకాశం ఉండదు. దానికి తోడు ఇప్పుడు కరోనా. కరోనా వల్ల ఎవరికి ఎంత నష్టం జరిగిందో తెలియదు కానీ... సినీ పరిశ్రమకు మాత్రం చాలా నష్టమే కలిగింది. షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపపడ్డాయి. ఒక పక్క సినీ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఒకరి నొకరు కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. గత ఆరు నెలలుగా ఇళ్లకే పరిమితమవ్వగా.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

TFN Adminవాట్సాప్
Naga Shaurya NS20 Movie Shooting Kickstarts.
షూటింగ్ అప్‌డేట్

#NS20 మూవీ షూటింగ్ ప్రారంభం

సోనాలి నారంగ్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా " #NS20 "మూవీ షూటింగ్ నిన్న (బుధవారం ) హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య కు జోడీగా "రొమాంటిక్ " మూవీ ఫేమ్ కేతిక శర్మ నటిస్తున్నారు. ఈ మూవీ లో తన క్యారెక్టర్ కై నాగశౌర్య సిక్స్ ప్యాక్ అబ్స్ ట్రై చేశారు.

Team TFNవాట్సాప్
This Japanese Pair Show Their Love For NTR Song With Their Dance Performance
సాంగ్

"కంత్రి" మూవీలో సాంగ్ కు జపాన్ జంట డ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సాంగ్స్ లోని క్లిష్ట మైన డ్యాన్స్ స్టెప్స్ ను అలవోకగా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇండియా లోనే కాకుండా జపాన్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం 'రౌద్రం రణం రుధిరం " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో "#NTR30" మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Tollywood Actor Venkatesh Urges Everyone To Follow COVID19 Safety Measures Strictly To Stay Safe From Corona Virus
సినిమా వార్తలు

ప్ర‌తి ఒక్క‌రికీ ఇదే నా విజ్ఞ‌ప్తి అంటున్న వెంకీ

రోజులు గడుస్తూనే ఉన్నాయి కానీ కరోనా ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తగ్గలేదు సరికదా రోజు రోజుకు కేసులు ఎక్కువవుతున్నాయి తప్పా తగ్గే సూచనలు కనిపించట్లేదు. సామాన్యుల దగ్గరనుండి సెలబ్రిటీస్ వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండి..జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటున్నాడు విక్టరీ వెంకటేష్.

TFN Adminవాట్సాప్
Popular Song From Ravi Teja Idiot Movie Goes To Bollywood.
సాంగ్

బాలీవుడ్ లో టాలీవుడ్ ఘనత

టాలీవుడ్ లో విజయం సాధించిన పలు మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత , దర్శకుల చూపు టాలీవుడ్ పైనే ఉండడం మనకు గర్వ కారణం. మూవీస్ తో పాటు సాంగ్స్ పైనా దృష్టి సారించారు. ఇప్పుడు ఒక తెలుగు సూపర్ హిట్ సాంగ్ ను హిందీ లో రీ మిక్స్ చేశారు. ఆ సాంగ్ బాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ మొదలుకావడం టాలీవుడ్ సాధించిన మరో ఘనత.

Team TFNవాట్సాప్
Bollywood Actor Sonu Sood Spreads The Message Of Giving Back To Society With His Philanthropic Activities
సినిమా వార్తలు

సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి..!

రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ సూద్. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. ఎన్నో మంచి మంచి సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు ఒక్కసారిగా కరోనా తెచ్చిపెట్టింది సోనూ సూద్ కి. తనలోని మరో మనిషిని బయటి ప్రపంచానికి చూపించాడు సోనూ సూద్. లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. లాక్‌డౌన్ లో ఎంతో మందిని ఆదుకొని దేవుడయ్యాడు. ఇక సోనూ సూద్ ఈ లాక్ డౌన్ లో చేసిన మంచి పనులు గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడు కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. స్టార్‌లే ఆశ్చర్యపోయే రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Rebel Star Prabhas Is A Highly Committed Person Says Radhe Shyam Director Radhakrishna Kumar
సినిమా వార్తలు

ప్రభాస్ కమిట్ మెంట్ లెవల్స్ పీక్స్

'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. 6.3 మిలియన్ల ట్వీట్స్ తో ఇంతకు ముందున్న ట్విట్టర్ రికార్డులను చెరిపేసింది.

TFN Adminవాట్సాప్
When Vijay Deverakonda Visited The Pre Release Event Of His Favorite Actor Super Mahesh Babu Movie Maharshi
సినిమా వార్తలు

అభిమాన హీరో సినిమాకే గెస్ట్ గా వచ్చిన వేళ

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎక్కడో కనిపించీ కనిపించని చిన్నపాత్రలో నటించి... ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి కొంచెం నోటెడ్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'సూపర్ మచ్చి' ఆఖరి షెడ్యూల్ ప్రారంభం

విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు దేవ్. పులి వాసు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'సూపర్ మచ్చి' అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా.. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్‌ తో వస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్