తెలుగు , కన్నడ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “సుల్తాన్ ” మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక నటించిన కన్నడ మూవీ “పొగరు ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయంలో రష్మిక తన స్వంత ఊరు కూర్గ్ లో 6 నెలల పాటు కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేసి, హైదరాబాద్ కు చేరుకున్నారు. రష్మిక ఇప్పుడు ఒక ఎమోషనల్ పోస్ట్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. తన జీవితంలో జరిగే మంచి గానీ చెడు గానీ చిరునవ్వు తో స్వీకరిస్తాననీ , ప్రపంచంలో అనేక సంఘటనలు జరుగుతాయనీ , వాటిని దూరంగా ఉంచుతాననీ , తాను గర్వంగా , గొప్పగా ఫీల్ అవుతాననీ , అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూ ఆనందంగా ఉంచాలని కోరుకుంటున్నాననీ , అభిమానులు తన మీద ఆధారపడినట్టుగానే తాను కూడా అభిమానులపై ఆధారపడి ఉంటాననీ , అభిమానులకు ఫేవరేట్ హీరోయిన్ గా ఉండాలనుకొనడం లేదనీ , అభిమానుల కుటుంబ సభ్యురాలిగా ఉండాలని కోరుకుంటున్నాననీ అంటూ తన లేటెస్ట్ ఫొటో ను రష్మిక షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: