మోదీ బయోపిక్ ‘మ‌నో విరాగి’ ఫస్ట్ లుక్ రిలీజ్

First Look Poster Of Prime Minister Narendra Modi Biopic Movie Mano Viragi Unveiled Today On The Occasion Of His Birthday

టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ ఒక్క సినీ ఇండస్ట్రీ అని కాదు..అన్ని సినీ ఇండస్ట్రీల్లోనూ బయోపిక్ ల హవా సాగుతుంది. పొలిటికల్ నేపథ్యంలో తెలుగులో ఎన్టీఆర్ మహానాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు మరికొంతమంది బయోపిక్ లు తెరకెక్కాయి.. రిలీజ్ కూడా అయ్యాయి. తమిళంలో జయలలిత బయోపిక్ కూడా రానుంది. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న్ భైరాగి. తెలుగులో మ‌నో విరాగి పేరుతో విడుద‌ల కానుంది. సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా… ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత సంజ‌య్ లీలా బ‌న్సాలీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈరోజు భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు కావడంతో రాజకీయ నాయకులతో పాటు సెలెబ్రిటీస్ అందరూ ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ బయోపిక్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఇక టాలీవుడ్ న‌టుడు ప్ర‌భాస్ తెలుగు వెర్ష‌న్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశాడు. హిందీ పోస్ట‌ర్ ను అక్ష‌య్ కుమార్ రిలీజ్ చేశాడు. పోస్ట‌ర్ లో ఓ వైపు మోదీ యువ‌కుడి లుక్ క‌నిపిస్తుండ‌గా..మరోవైపు ఓ వ్య‌క్తి బ్యాగు వేసుకుని మ‌ట్టి రోడ్డుపై నుంచి న‌డుచుకుంటూ వ‌స్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − 1 =