అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు సిద్దమైన ‘నిశ్శబ్దం’

Anushka Shetty Most Awaited Movie Nishabdham All Set To Release On This OTT Platform

మొత్తానికి ఇన్ని రోజుల సస్పెన్స్ తర్వాత నిశ్శబ్దం సినిమా రిలీజ్ పై ఒక క్లారిటీ వచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దానికితోడు ఈ కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీ లోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని అన్నారు. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ పడింది. రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్స్ లేవు కాబట్టే ఓటీటీ కే మొగ్గు చూపారు చిత్ర యూనిట్. వచ్చే నెల అంటే అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.