ఓం, ఎ, రా, హెచ్ టూ ఓ, లాంటి వైవిధ్యమైన సినిమాలు చేయాలంటే కన్నడ హీరో ఉపేంద్ర తర్వాతే ఎవరైనా. కేవలం కన్నడలోనే కాదు తెలుగులో కూడా ఉపేంద్రకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ‘కబ్జ’ అనే మరో విభిన్నమైన సినిమాతో వస్తున్నాడు. 1980 ల కాలంనాటి పరిస్థితుల నేపథ్యం లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక థీమ్ పోస్టర్‌లో గన్స్‌తో పాటు కింద శవాలు పడిఉన్నాయి. ఉపేంద్ర బండి మీద వస్తున్న రెట్రో లుక్‌తో పాటు, డాన్ లెవల్‌లో ఉన్న రాయల్ లుక్ ఆకట్టుకుంటుంది.
కాగా ఈ సినిమాలో జగపతి బాబు, నానా పాటేకర్, మనోజ్ బాజ్ పాయ్ , ప్రదీప్ రావత్, ప్రకాష్ రాజ్, సముద్ర ఖని, జయప్రకాశ్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఏడు భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలలో ఈ సినిమా రూపొందుతుంది. నిర్మాత ఆర్. చంద్రు చైనీస్ భాషలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
మరి బ్రహ్మ’, ‘ఐ లవ్యూ’ చిత్రాల తర్వాత ఉపేంద్ర, చంద్రు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: