టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్ట్రెస్ లో నివేద థామస్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. ఎన్ని సినిమాలు చేశామన్నది.. ఎవరితో చేశామన్నది కాదు.. ఎలాంటి పాత్ర చేసాం.. ఆడియన్స్ కు ఎంత నచ్చింది అనేది చూసే హీరోయిన్స్ లో నివేద కూడా ఒకటి. అందుకే మొదటి నుండి అలాంటి పాత్రలే ఎన్నుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల విడుదలైన ‘వి’ సినిమాలో కూడా క్రైమ్ రైటర్ గా విభిన్నమైన పాత్రలో నటించి ఎప్పటిలాగే సూపర్ అనిపించుకుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు కు జోడీగా నటించగా.. వీరిద్దరి పెయిర్ కు మంచి మార్కులు పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అవ్వగా అప్పటి నుండి ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది నివేద. దీనిలో భాగంగానే తాజాగా మరో వీడియో ను పోస్ట్ చేసింది. ‘వి’ చిత్రంలోని పాటల కోసం చేసిన ప్రాక్టీస్ వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. డ్యాన్స్ మాస్టర్ విజయ్‌కు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. నివేదా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసున్న ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
Practice for progress. Thank you @vijay_binni master ✌️ #vonprime @mohanakrishnaindraganti 🤗
కాగా “జెంటిల్ మన్ ” సినిమాతో తో టాలీవుడ్ కు పరిచయమైన నివేద.. “నిన్నుకోరి”, “జై లవకుశ “, “118 “, “బ్రోచేవారెవరురా ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాది పొంగల్ కి విడుదలైన దర్బార్ సినిమాలో రజినీ కాంత్ కు కూతురి పాత్రలో నటించి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు.. మరో రెండు తెలుగు చిత్రాలలో నివేద నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: