ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 54
ప్రభాస్ ఛాలెంజ్ పూర్తిచేసిన శ్రద్దా
తమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్
కాజల్ అగర్వాల్ ఫిలాసఫీ
కామెడీ థ్రిల్లర్ మూవీ లో నివేత పేతురాజ్
కుక్క పిల్లలను రక్షించిన ఆది పినిశెట్టి
కార్పొరేట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో తమన్నా
'వర్మ' బయోపిక్ షూటింగ్ మొదలు
బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచన లేదు -రాశీఖన్నా
మెగా బ్రదర్ కి కరోనా పాజిటివ్
ప్రభాస్ కు బ్రదర్ గా అథర్వా మురళి..?
వాటర్ ఫాల్స్ దగ్గర చై- సాయి పల్లవి 'లవ్ స్టోరీ'

30 వసంతాల "బొబ్బిలి రాజా "
'శివగామి' కి 'దర్శకేంద్రుడి' విషెస్
సినిమా నుండి రిటైర్ అయినట్టుంది
అభిమానులకు స్టార్ హీరో ఉపేంద్ర రిక్వెస్ట్
నాన్న ఆరోగ్యం మెరుగుపడుతుంది - ఎస్పీ చరణ్
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతుంది. ఆయన అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చేసిన ప్రార్ధనలు ఫలిస్తున్నాయి. ఇక బాలు హెల్త్ అప్ డేట్స్ గురించి తనయుడు చరణ్ ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఎస్పీ చరణ్ తెలిపారు. తన తండ్రి ఈసీఎంవో సపోర్టుతో ఉన్నారని.. ఫిజియోథెరపీలో చురుకుగా పాల్గొంటున్నారని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. తన తండ్రి త్వరగా కోలుకోవడం కోసం శ్రమించిన ఆస్పత్రి వైద్యులకు, ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభాస్ ఛాలెంజ్ పూర్తిచేసిన శ్రద్దా
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ లో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ పాల్గొని పూర్తి చేశారు. కేవలం సినీ సెలబ్రిటీస్ మాత్రమే కాదు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసింది.
డైరెక్షన్ పై నిఖిల్ క్లారిటీ - ఇప్పుడే డైరెక్ట్ చేయను
హీరో నిఖిల్ డైరెక్టర్ గా మారబోతున్నాడని.. ఒక ఎక్స్పెరిమెంటల్ చిల్డ్రన్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించిన నిఖిల్ తన డైరెక్షన్ పై క్లారిటీ ఇచ్చాడు.
తమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్
"శ్రీ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలలో తన అందం , అభినయంతో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తమన్నా తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ " మూవీ లో కబడ్డీ మహిళా కోచ్ గా నటిస్తున్నారు . నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా రూపొందుతున్న "బోలే చూడియన్ " హిందీ మూవీ లో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు.
సింగీతం శ్రీనివాసరావు కి కరోనా పాజిటివ్ - నేనెప్పుడూ 'పాజిటివే'
టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఈరోజు ఉదయాన్నే మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అది మరిచిపోకముందే మరో లెజెండ్రీ డైరెక్టర్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. సింగీతం శ్రీనివాసరావు. ఈ విషయాన్ని వీడియో ద్వారా స్వయంగా వెల్లడించారు సింగీతం.
కాజల్ అగర్వాల్ ఫిలాసఫీ
తెలుగు ,తమిళ స్టార్ హీరోలతో జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ భాషలతో పాటు హిందీ భాషలో కూడా కాజల్ నటిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు "(తెలుగు ), "ఇండియన్ 2 ", "హే సనమిక "(తమిళ ) "ముంబై సాగా " (హిందీ ) మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీస్ తో పాటు కాజల్ , స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందనున్న "తుపాకి 2", హరి దర్శకత్వంలో స్టార్ హీరోసూర్య కథానాయకుడిగా రూపొందనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
కామెడీ థ్రిల్లర్ మూవీ లో నివేత పేతురాజ్
తమిళ హీరోయిన్ నివేత పేతురాజ్ సక్సెస్ ఫుల్ "మెంటల్ మదిలో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "చిత్ర లహరి ", "బ్రోచేవారెవరురా ", "అల .. వైకుంఠపురములో " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేత నటించిన "RED " మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 3 తమిళ మూవీస్ లో నటిస్తున్న నివేత ఇప్పుడు ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కుక్క పిల్లలను రక్షించిన ఆది పినిశెట్టి
కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు ఆది. అందుకే అటు తమిళ్ లోనూ ఇటు తెలుగులోనూ మంచి రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఆది పినిశెట్టికి సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అదేంటంటే ఓ రెస్క్యూ ఆపరేషన్ చేశాడు ఆది. ఇంతకీ ఎవర్ని రక్షించాడనుకుంటున్నారా ? అసలు సంగతేంటో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే.
కార్పొరేట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో తమన్నా
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు ముఖ్య వినోద సాధనం సినిమా. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మూత పడడంతో ప్రేక్షకులకు OTT సంస్థల ద్వారా ఉపశమనం లభించింది. OTT ల ద్వారా మూవీస్ తో పాటు వెబ్ సిరీస్ ప్రసారం అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాత , దర్శకులు వెబ్ సిరీస్ లు రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్స్ సమంత , కాజల్ అగర్వాల్ , అంజలి , రమ్యకృష్ణ , రాశీఖన్నా వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
'వర్మ' బయోపిక్ షూటింగ్ మొదలు
ఇప్పటివరకూ యదార్థ సంఘటనల ఆధారంగా.. పలువురి జీవిత చరిత్రల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వంతు వచ్చింది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ మీద పలువురు బయోపిక్ లు తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో బయోపిక్ రానుంది. మూడు భాగాలుగా రూపొందిస్తున్న ఈ బయోపిక్ లో మొదటి పార్ట్ ను రాము అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచన లేదు -రాశీఖన్నా
బ్లాక్ బస్టర్ "మద్రాస్ కేఫ్ " (2013) మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ "ఊహలు గుస గుస లాడే " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా సూపర్ హిట్ "ఇమైక్క నోడిగళ్ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యి పలు సూపర్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ లో బిజీగా మారారు. రాశీఖన్నా ప్రస్తుతం 2 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ కు రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సాంగ్ చిత్రీకరణలో "లవ్ స్టోరీ "
నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాగచైతన్య , సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పడం విశేషం. పవన్ CH సంగీతం అందిస్తున్నారు. "లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉండగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.
మెగా బ్రదర్ కి కరోనా పాజిటివ్
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి కరోనా వల్ల చాలా నష్టం జరిగిపోయింది. దానికితోడు ఎంతో మంది లెజెండ్రీ నటీనటులు కూడా ఈ ఏడాదే కన్ను మూసారు. దానికితోడు కరోనా ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ ను టార్గెట్ చేసింది. అదేంటో షూటింగ్ లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా కూడా కరోనా సోకిన సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. లెజండరీ డైరెక్టర్ రాజమౌళి నుండి తేజ, డీవీవీ దానయ్య, తేజ, సింగర్ సునీత ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది.. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు మరో సెలబ్రిటీకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు మెగా బ్రదర్ నాగబాబు.
ప్రభాస్ కు బ్రదర్ గా అథర్వా మురళి..?
విభిన్నమైన పాత్రలతో తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అథర్వా మురళి. ఈ మధ్య విడుదలైన వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో కీలక పాత్ర చేసి ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తమిళ్ సినిమాల్లో చేస్తూనే తెలుగులో కూడా అవకాశాలు కొట్టేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది.
వాటర్ ఫాల్స్ దగ్గర చై- సాయి పల్లవి 'లవ్ స్టోరీ'
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమా ఇప్పటికే చాల వరకు షూటింగ్ ను పూర్త చేసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు చిత్రయూనిట్. చక చక ఈ షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడ - బోడకొండ వాటర్ ఫాల్ దగ్గర చిత్రీకరణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. చుట్టూ పచ్చటిప్రకృతిసౌందర్య ఆకట్టుకునే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చిత్రయూనిట్ సందడి చేసినట్టు…

30 వసంతాల "బొబ్బిలి రాజా "
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ , దివ్య భారతి జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "బొబ్బిలి రాజా" మూవీ 1990 సంవత్సరం సెప్టెంబర్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇళయ రాజా స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకుల వీనుల విందు చేశాయి. "బొబ్బిలి రాజా" మూవీ లోని వెంకటేష్ డైలాగ్ "అయ్యో అయ్యో అయ్యయ్యో " పాపులర్ అయ్యి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
'శివగామి' కి 'దర్శకేంద్రుడి' విషెస్
హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. ఆతర్వాత 'నరసింహ' సినిమాలోని నీలాంబరి పాత్రతో తనలోని మరో యాంగిల్ ను చూపించి తన రేంజ్ ను మార్చేసింది రమ్యకృష్ణ. గ్లామరోతో కూడిన పాత్రలోనైనా, సీరియస్ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోగల నటి రమ్యకృష్ణ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో దాదాపు 260కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. స్టార్ హీరోయిన్‌గా అగ్ర కథానాయకులందరితోనూ ఆమె నటించారు. ఇక ఇటీవల వచ్చిన 'బాహుబలి' సినిమాతో శివగామిగా తారా స్థాయి కి చేరుకుంది. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది రమ్యకృష్ణ.
సినిమా నుండి రిటైర్ అయినట్టుంది
లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అందరూ ఇంట్లోనే వుంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ కూడా కొత్త కొత్త వంటలు.. ఆన్లైన్ క్లాసెస్.. వర్కౌట్స్ అంటూ దొరికిన సమయాన్ని బాగానే ఉపయోగించుకుంటున్నారు. అలాగే లాక్ డౌన్ లోనే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటూ తమ అప్ డేట్స్ ఇస్తున్నారు. అయితే రెజీనాకు మాత్రం ఏదో సినిమా నుండి రిటైర్డ్ అయ్యానేమో అన్న ఫీలింగ్ వస్తుందట.
అభిమానులకు స్టార్ హీరో ఉపేంద్ర రిక్వెస్ట్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో ఉపేంద్ర సక్సెస్ ఫుల్ హీరో , దర్శకుడిగా శాండల్ వుడ్ లో కొనసాగుతున్నారు. "కన్యాదానం ", "S/O సత్యమూర్తి " వంటి మూవీస్ తో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఉపేంద్ర హీరోగా రూపొందిన పలు కన్నడ మూవీస్ తెలుగు లో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ అయ్యి విజయం సాధించాయి. బెస్ట్ యాక్టర్ , బెస్ట్ డైరెక్టర్ గా పలుమూవీస్ కు ఉపేంద్ర అవార్డ్స్ అందుకున్నారు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సెట్ లో బుట్టబొమ్మ
మొత్తానికి ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి షూటింగ్ లను స్టార్ట్ చేస్తున్నారు. ఇంకెన్ని రోజులు ఉన్నా కరోనా ప్రభావం తగ్గేలా లేదు.. ఇలానే ఉన్నా వర్కౌట్ కాదులే అని అందరూ షూటింగులను మొదలు పెడుతున్నారు. చాలా సినిమాల షూటింగ్స్ చివరి దశలో ఉండటంతో కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ పార్ట్ వరకూ ముందు ఫినిష్ చేస్తే రిలీజ్ సంగతి తర్వాత చూడొచ్చులే అని షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్స్ మొదలైన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు మొదలై షూటింగ్ పూర్తి చేసుకున్నాయి కూడా.