విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎక్కడో కనిపించీ కనిపించని చిన్నపాత్రలో నటించి… ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి కొంచెం నోటెడ్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విజయ్ మహేష్ కు పెద్ద ఫ్యాన్ అని చెప్పక్కర్లేదు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో కూడా చెప్పాడు. మహేష్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడటంకోసం లైన్ లో వెయిట్ చేసేవాడినని చెప్పిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. ఇక మహేష్ కూడా ఇప్పుడున్న యంగర్ జనరేషన్ లో విజయ్ తనకు నచ్చిన హీరో అని చెప్పాడు. మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ కూడా ఒక గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో విజయ్, అతని హార్డ్ వర్క్ అంటే ఇష్టమని… శ్రీమంతుడు సినిమా అప్పుడు నేను అవార్డ్ తీసుకుంటుంటే విజయ్ చూసి లైఫ్ అంటే ఇలా ఉండాలి అనుకున్నాడంటా.. నీ లైఫ్ ఇప్పుడు సూపర్ ఉందమ్మా.. నీ టైం నడుస్తుంది ఏం పర్లేదు అని నవ్వుతూ కామెడీ చేసాడు. మరి తన అభిమాన హీరో సినిమా ప్రీ రిలీజ్ కు తానే గెస్ట్ గా రావడం అంటే మరి మాములు విషయం కాదు కదా. ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి రారు.
కాగా కేవలం కమెర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ఓ సోషల్ మెసేజ్ కూడా అందులో జోడించి ఆడియన్స్ సైతం ఆలోచింప చేసే విధంగా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు తో ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ ను తీసుకొచ్చాడు. అంతకు ముందే ఊరిని దత్తత తీసుకోవాలన్న కాన్సెప్ట్ వున్నా కానీ.. శ్రీమంతుడు సినిమాతో అది మరింత వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు ప్రధానపాత్రలో తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ సినిమాలో స్నేహం, లక్ష్యం, రైతుల సమస్యల గురించి వివరంగా చెప్పారు. అంతేకాదు వీకెండ్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ ను కూడా ఈ సినిమాతో తెరపైకి తీసుకొచ్చాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: