స్పెషల్ డే రోజు కె.జి. ఎఫ్ 2 టీజర్..?

KGF 2 Teaser Will Be More Likely To Come Out By Dussehra

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి. ఎఫ్ 2 సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూసారో.. అంత లేట్ అయింది. అయితే కావాలని లేట్ చేయలేదులెండి. కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోవడం వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. మళ్లీ కొద్దిరోజుల క్రితమే షూటింగ్ ను మొదలు పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా నుండి త్వరలోనే టీజర్ రిలీజ్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 23 న దసరా పండుగ సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ డేట్ న సినిమానే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పరిస్థితులు అందుకు అనుకూలించలేదు. దీనితో టీజర్ అయినా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లతో పాటు తెలుగు నటుడు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − four =