టాలీవుడ్ స్టార్ దర్శకులంతా ఒకే చోట కలిసి ఉండటం.. చిన్న పార్టీ చేసుకొని అందరూ కలిసీ తినడం చాలా అరుదుగా జరిగే విషయాలు. ఎప్పుడో ఏదైనా విషయం ఉంటే తప్పా కలుసుకునే అవకాశం ఉండదు. దానికి తోడు ఇప్పుడు కరోనా. కరోనా వల్ల ఎవరికి ఎంత నష్టం జరిగిందో తెలియదు కానీ… సినీ పరిశ్రమకు మాత్రం చాలా నష్టమే కలిగింది. షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపపడ్డాయి. ఒక పక్క సినీ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఒకరి నొకరు కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. గత ఆరు నెలలుగా ఇళ్లకే పరిమితమవ్వగా.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా తెలుగు దర్శకులంతా ఒకే చోట చేరారు. అందరు కలిసి సరదాగా భోజనంకూడా చేశారు. డైరెక్టర్ క్రిష్ తన ఇన్స్టాలో ఈ ఫొటో షేర్ చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జీవితం అనేది అనేక అవకాశాలు ఇస్తుంది… మన జీవితాలు మనం తీసుకునే మరియు మనం తీసుకోని కథలు” అని పోస్ట్ పెట్టాడు. ఇకఈ ఫొటోలో స్టార్ డైరెక్టర్స్ అందరూ వున్నట్టే కనిపిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, హరీష్ శంకర్, నాగ్ అశ్విన్, జాగర్లమూడి క్రిష్ కనిపిస్తున్నారు. ఈ ఫోటోను క్రిష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. ”జీవితం అనేది అవకాశాల పరంపర. మన జీవితాలు మనం తీసుకునే మరియు మనం తీసుకోని వారి కథలు” అని పోస్ట్ పెట్టాడు. ఏదిఏమైనా తెలుగు దర్శకులంతా కలిసి ఉండటం అనేది గొప్ప విషయం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: