సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి..!

Bollywood Actor Sonu Sood Spreads The Message Of Giving Back To Society With His Philanthropic Activities

రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ సూద్. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. ఎన్నో మంచి మంచి సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు ఒక్కసారిగా కరోనా తెచ్చిపెట్టింది సోనూ సూద్ కి. తనలోని మరో మనిషిని బయటి ప్రపంచానికి చూపించాడు సోనూ సూద్. లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. లాక్‌డౌన్ లో ఎంతో మందిని ఆదుకొని దేవుడయ్యాడు. ఇక సోనూ సూద్ ఈ లాక్ డౌన్ లో చేసిన మంచి పనులు గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడు కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. స్టార్‌లే ఆశ్చర్యపోయే రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా సోనూ సూద్ చెప్పిన ఒక మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. `సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వకపోయినట్టైతే.. నేను మంచి జీవితాన్ని అనుభవిస్తున్నట్టు కాద`ని సోనూ పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ మాట పలువురిని ఆలోచింప చేసే విధంగా వుంది. మరి సోనూసూద్ లాగే ఎంతో మంది ప్రముఖులు బయటకు వచ్చి ఇలా పేదలకు సాయం చేస్తే ఎంతో బావుంటుంది.

కాగా హేండ్స‌ప్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన న‌టుడు సోను సూద్‌. ‘సూప‌ర్’ చిత్రం తొలి బ్రేక్‌నిస్తే.. ‘అరుంధ‌తి’ చిత్రం సోనూ సూద్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్క‌సారిగా మార్చివేసింది. ఆ త‌రువాత పలు తెలుగు చిత్రాల‌లో విల‌న్‌గా సంద‌డి చేశారు. ప్రస్తుతం తెలుగు, హిందీ లో పలు సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 6 =