డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఇన్నిరోజులు షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. సందీప్ కిషన్ కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ కాస్త ధైర్యం చేసి షూటింగ్ లను మొదలు పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా షూటింగ్ అప్ డేట్స్ ఇచ్చాడు సందీప్ కిషన్. సక్సెస్ ఫుల్ గా ఏ1 ఎక్స్ ప్రెస్ లాస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయిందని.. ఈ పరిస్థితిలో షూట్ చేయడానికి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు మీ విషెస్ కు ప్రేయర్స్ కు థ్యాంక్స్. దానివల్లే సేఫ్ గా షూటింగ్ పూర్తి చేయగలిగాము. అలాగే వివాహ భోజనంబు సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాము. ఈ సినిమాకు కూడా మీ ప్రార్ధనలు కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు.
కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వివాహ భోజనంబు సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమాను సందీప్ కిషన్, శినీష్, కిరణ్ నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: