విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు దేవ్. పులి వాసు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ‘సూపర్ మచ్చి’ అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా.. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్ తో వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల అందరూ షూటింగ్స్ కు వెళ్లకుండా ఉన్నా.. ఈ చిత్ర యూనిట్ మాత్రం షూటింగ్ ను మాత్రం జరుపుతూనే వున్నారు. దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇక తాజాగా ఆఖరి షెడ్యూల్ ను ప్రారంభినట్టు తెలిపాడు కళ్యాణ్ దేవ్. సెట్స్ లో ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ నిర్వహిస్తున్నారు.
కాగా ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ సరసన కన్నడ బ్యూటీ రచితా రామ్ హీరోయిన్గా నటిస్తుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: