కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 52

సినిమా వార్తలు

హ్యాపీ బర్త్ డే హీరో.. నాకు పోటి ఇచ్చేది ఇతనే

సోనూసూద్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఎవరున్నారు. సినిమాల వల్ల కొంతమందికే తెలిసినా.. కరోనా వల్ల సోనూసూద్ పేరు అందరికీ పరిచయమైంది. ఈ పరిస్థితుల్లో ఎందరినో ఆదుకున్నారు. ముఖ్యంగా వలస కార్మికులకు, విదేశాలలో ఉండిపోయిన భారతీయుల కోసం ఆయన అనేక సేవలు చేసారు. అంతేకాదు కష్టంలో ఉన్నామని ట్వీట్స్ చేసిన వారిని కూడా సోనూ తనదైన తరహాలో ఆదుకున్నాడు... ఆదుకుంటూనే వున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

క్యూట్ స్మైల్ తో ఇలియానా

లాక్ డౌన్ వల్ల అందరూ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు దగ్గరగానే వుంటున్నారు. ఇక ఇలియానా కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా తన చిన్ననాటి ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. ఇక చిన్ననాటి ఫొటోలో ఇలియానా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ ఇస్తుంది. ఈ పిక్ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"రంగ్ దే !" మూవీ లో కీలక పాత్రలో వినీత్

క్లాసికల్ డ్యాన్సర్ , వాయిస్ ఆర్టిస్ట్ వినీత్ పలు తమిళ , మలయాళ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. కన్నడ , హిందీ భాషలలో నటించిన వినీత్ తెలుగు లో కొన్ని సినిమాలలో హీరోగా నటించారు. బ్లాక్ బస్టర్ "ప్రేమ దేశం ", "చంద్ర ముఖి " మూవీస్ లో వినీత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ లో డ్యాన్సింగ్ ఎక్సర్ సైజ్ లతో ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ వినీత్ తన స్టూడెంట్స్ కు ఆన్ లైన్ లో డ్యాన్స్ క్లాసెస్ నిర్వ హిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లో వినీత్ పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ లో షాలిని పాండే

థియేటర్ ఆర్టిస్ట్ షాలిని పాండే బ్లాక్ బస్టర్ "అర్జున్ రెడ్డి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి షాలిని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సూపర్ హిట్ "మహానటి ", "118 " మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. "100%కాదల్ " మూవీ తో షాలిని కోలీవుడ్ లో అడుగుపెట్టారు. షాలిని పాండే కీలక పాత్రలో నటించిన "నిశ్శబ్దం " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. షాలిని ఇప్పడు భారీ బడ్జెట్ మూవీ తో బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ రిలీజ్ డేట్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , ఈషా రెబ్బా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆ సర్‌ప్రైజ్ లు మిస్ అవుతున్నా అంటున్న మంచు లక్ష్మీ

లాక్ డౌన్ వల్ల మీటింగ్ లు చాటింగ్ లు పార్టీలు అంటూ సరదాగా గడిపే సెలబ్రిటీస్ కు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఎవరి ఇంట్లో వాళ్లే కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి సర్ ప్రయిజ్ లే మిస్ అవుతున్నా అంటుంది మంచు లక్ష్మీ. అసలు సంగతేంటంటే.. మన తెలుగు హీరోయిన్స్ తో, పలువురు సెలబ్రిటీస్ తో మంచు లక్ష్మీ చాలా సన్నిహితంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సమంత, ఉపాసన, శిల్పా రెడ్డి, రకుల్ మొదలైన వాళ్లతో మంచు లక్ష్మి తరచుగా టైమ్ స్పెండ్ చేస్తుంటుంది. వారిని కలవడం.. వారితో టైం స్పెండ్ చేయడం ఇలా జరుగుతూనే ఉంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అఫీషియల్..అందాదూన్ రీమేక్ లో తమన్నా, నభా

మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అందాదూన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదనుకోండి. ఇక అందాదూన్ సినిమా చూసిన ఎవరికైన ఈ సినిమాలో టబు పాత్ర ఎంత కీలకమో తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పాత్రలో తెలుగులో ఎవరు నటిస్తారబ్బా అన్న దానిపై గతకొద్దిరోజులుగా పలువురి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల శ్రీయా పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు అంత ఇంపార్టెంట్ రోల్ లో ఎవరు నటిస్తున్నారో క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రేష్ఠ్‌ మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించారు. టబు స్థానంలో మిల్కీబ్యూటీ తమన్నా నటించనుండగా..రాధికా ఆప్టే స్థానంలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మాట నిలబెట్టుకున్న మెగా హీరో

కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. ఇప్పుడు మరో హీరో కూడా తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు మెగా హీరో సాయితేజ్. ఇంతకీ ఏం మాట నిలబెట్టుకున్నాడు అనుకుంటున్నారు కదా. అసలు సంగతేంటంటే...

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"మోసగాళ్ళు " మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో వాస్తవ సంఘటనల ఆధారంగా అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో "మోసగాళ్ళు " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ ముగింపు దశలో ఉన్న "మోసగాళ్ళు " మూవీ కి నివాస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"V" మూవీ పై అల్లు శిరీష్ ప్రశంసలు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. హీరో నాని 25 వ మూవీ గా రూపొందిన "V" మూవీ లో ఫస్ట్ టైమ్ హీరో నాని నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సుధీర్ బాబు , నివేద , అదితి రావు తమ పాత్రోచితం గా నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న న్యాచురల్ బ్యూటీ

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక సాయి పల్లవి ఎంత సింపుల్ గా ఉంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత స్టార్ డమ్ ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అంతే కాదు ప్రకృతి అంటే కూడా తనకు ఎంత ఇష్టమో ఎన్నో సందర్భాల్లో చూసాం కూడా. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి సాయి పల్లవి తన ఇన్స్టా ద్వారా పోస్ట్ చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వీక్లీ రౌండప్.. లేటెస్ట్ మూవీ అప్ డేట్స్ మీ కోసం

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ - వర్క్ మోడ్ లోకి అఖిల్

అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇన్ని రోజులు పూజా హెగ్డే షూటింగ్ లో పాల్గొనగా.. ఇప్పుడు అఖిల్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. సెట్స్ లో ఉన్న ఫొటో ను పోస్ట్ చేస్తూ ఇక ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా తెలిపాడు అఖిల్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అన్నాత్తే.. 'రజినీ' కి విలన్ గా..!

శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేస్తే ఓ పని అయిపోద్దని భావిస్తున్నారట చిత్రయూనిట్. దీనిలో భాగంగానే త్వరలోనే షూట్ ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Talent and Success Play A Vital Role In Film Career Of Any Actor Says Actress Tamannaah
సినిమా వార్తలు

టాలెంట్ , సక్సెస్ లే ముఖ్యం - తమన్నా

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో తన అందం , అభినయం తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కథానాయిక గానే కాకుండా తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం "సీటీ మార్ ", "బోలే చుడియన్ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. "గుర్తుందా శీతాకాలం " మూవీ లో తమన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మీతో షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!

ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో క‌న్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Chi La Sow Actress Ruhani Sharma Posts A Video Of Herself In Mask On Social Media
సినిమా వార్తలు

మాస్క్ లో ముద్దుగుమ్మ

పంజాబీ మ్యూజిక్ వీడియోస్ లో నటించిన హిమాచల్ బ్యూటీ రుహానీ శర్మ "కడైసీ బెంచ్ కార్తీ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. బెస్ట్ స్క్రీన్ ప్లే గా నేషనల్ అవార్డ్ అందుకున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్" చి ల సౌ" మూవీ తో రుహానీ శర్మ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆమూవీ లో తన అందం , అభినయంతో రుహానీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "కమల " మూవీ తో రుహానీ శర్మ మలయాళ చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'గమనం' నుండి నిత్యామీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్

సుజ‌నా రావు దర్శకత్వంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో వస్తున్న సినిమా ‘గ‌మ‌నం’. చాలా గ్యాప్ తర్వాత శ్రియ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక రీసెంట్ గానే శ్రియ పుట్టిన‌రోజు సందర్భంగా ఈ సినిమా నుండి శ్రియ ఫ‌స్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నటిస్తోన్న నిత్యామీనన్‌ లుక్‌ను హీరో శర్వానంద్‌ తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. నిత్యా శైలపుత్రీదేవి అనే శాస్త్రీయ సంగీత గాయని పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నిత్యామీనన్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'చావు కబురు చల్లగా' - రానున్న 'బస్తీ బాలరాజు' గ్లింప్స్ వీడియో

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ 'చావు కబురు చల్లగా' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాలో బస్తీ బాలరాజు గా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Chiyaan Vikram Cobra Movie Team Releases An Interesting Update
సినిమా వార్తలు

"కోబ్రా " మూవీ అప్ డేట్

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ "కోబ్రా "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "KGF చాప్టర్ 1 " మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మియా జార్జ్ , కె ఎస్ రవికుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్