మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 6 నెలల పాటు ఇంటికే పరిమితం అయిన రామ్ చరణ్ ఇంటిలోనే వర్కౌట్స్ చేస్తూ టైమ్ పాస్ చేశారు. ఇప్పుడు జిమ్ లు ప్రారంభం కావడంతో హీరోలు , హీరోయిన్స్ జిమ్ బాట పట్టారు. హీరో రామ్ చరణ్ కూడా జిమ్ కు వెళ్ళి వర్కౌట్స్ చేయాలని డిసైడ్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన Mr C బ్యాక్ ఇన్ ది జిమ్ అంటూ మాస్క్ తో ఉన్న రామ్ చరణ్ ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. రామ్ చరణ్ హ్యాపీ మూడ్ తో జిమ్ కు వెళ్ళారు. “RRR ” మూవీ తరువాత రామ్ చరణ్ , కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటించనున్నారు. రామ్ చరణ్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న “RRR ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























