సోనాలి నారంగ్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా ” #NS20 “మూవీ షూటింగ్ నిన్న (బుధవారం ) హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య కు జోడీగా “రొమాంటిక్ ” మూవీ ఫేమ్ కేతిక శర్మ నటిస్తున్నారు. ఈ మూవీ లో తన క్యారెక్టర్ కై నాగశౌర్య సిక్స్ ప్యాక్ అబ్స్ ట్రై చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఆర్చరీ పై ఇండియా లో ఫస్ట్ మూవీ గా రూపొందుతున్న #NS20 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. హీరో నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ తో ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కొవిడ్ -19 జాగ్రత్తలతో #NS20 మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. సీనియర్ నటుడు జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. #NS20 మూవీ కి “పార్థు “టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ తో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: