యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సాంగ్స్ లోని క్లిష్ట మైన డ్యాన్స్ స్టెప్స్ ను అలవోకగా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇండియా లోనే కాకుండా జపాన్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘రౌద్రం రణం రుధిరం ” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#NTR30” మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ అభిమానులు మునిరు , అశాహి ససాకీ ఎన్టీఆర్ సాంగ్స్ ను అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన “అశోక్” మూవీ లోని “గోల గోల ” సాంగ్ , “సింహాద్రి” మూవీ లోని “చీమ చీమ ” సాంగ్స్ కు పెర్ఫార్మ్ చేసిన ఆ జంట ఇప్పుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన “కంత్రి ” మూవీ లోని “వయస్సునామీ “సాంగ్ కు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “కంత్రి ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన మెహెర్ రమేష్ ఆ మూవీ లో ఎన్టీఆర్ ను ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: