‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. 6.3 మిలియన్ల ట్వీట్స్ తో ఇంతకు ముందున్న ట్విట్టర్ రికార్డులను చెరిపేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా డైరెక్టర్ రాధా కృష్ణ తన హీరో గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాధా కృష్ణ ప్రభాస్ గురించి మాట్లాడుతూ… ప్రభాస్ తన వృత్తి పట్ల చాలా కమిట్ ఉన్న వ్యక్తి.. తన కమిట్ మెంట్ లెవెల్స్ కానీ.. షూటింగ్స్ లో చేసే విధానం కానీ చాలా డిఫికల్ట్. సినిమా అంటే అంత ప్యాషన్ ఉంది కాబట్టే తను ఇప్పుడు ఈ రేంజ్ లో వున్నాడు అని తెలిపాడు. మరి నిజంగానే ప్రభాస్ ఇప్పుడు ఇంత రేంజ్ లో ఉన్నాడంటే.. ప్రభాస్ డెడికేషనే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























