“V” మూవీ పై అల్లు శిరీష్ ప్రశంసలు

Actor Allu Sirish is All Praises For V Movie Team

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. హీరో నాని 25 వ మూవీ గా రూపొందిన “V” మూవీ లో ఫస్ట్ టైమ్ హీరో నాని నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సుధీర్ బాబు , నివేద , అదితి రావు తమ పాత్రోచితం గా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో అల్లు శిరీష్ “V” మూవీ పై ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. “V” మూవీ థియేటర్ లో చూడడం మిస్ అయ్యాననీ , అమెజాన్ ప్రైమ్ వీడియో లో చూసి ఎంజాయ్ చేశాననీ , హీరో నాని నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ , యాక్షన్ సీన్స్ , ట్విస్ట్ లు , నటీనటుల పెర్ఫార్మెన్స్ తో “V” టీమ్ రూపొందించిన సూపర్ థ్రిల్లర్ “V” మూవీ చూసి ఎంజాయ్ చేయండని అల్లు శిరీష్ ట్వీట్ చేశారు.
అమిత్ త్రివేది “V” మూవీ సాంగ్స్ కంపోజ్ చేయగా థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − four =