హ్యాపీ బర్త్ డే హీరో.. నాకు పోటి ఇచ్చేది ఇతనే

Bollywood Actor Sonu Sood Wishes His Son Eeshan Sood On His Birthday With An Adorable Pic On Social Media

సోనూసూద్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఎవరున్నారు. సినిమాల వల్ల కొంతమందికే తెలిసినా.. కరోనా వల్ల సోనూసూద్ పేరు అందరికీ పరిచయమైంది. ఈ పరిస్థితుల్లో ఎందరినో ఆదుకున్నారు. ముఖ్యంగా వలస కార్మికులకు, విదేశాలలో ఉండిపోయిన భారతీయుల కోసం ఆయన అనేక సేవలు చేసారు. అంతేకాదు కష్టంలో ఉన్నామని ట్వీట్స్ చేసిన వారిని కూడా సోనూ తనదైన తరహాలో ఆదుకున్నాడు… ఆదుకుంటూనే వున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

 

View this post on Instagram

 

Happy birthday my hero❤️ @eshaansoood . Finally I have someone who’s going to give me competition in fitness 😂

A post shared by Sonu Sood (@sonu_sood) on

ఇక సోనుసూద్ ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు పోటీ ఇచ్చే వ్యక్తి వచ్చాడు అంటున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు తన కొడుకు ఇషాన్ సూద్. అసలుసంగతేంటంటే.. ఈ రోజు సోనూసూద్‌ కుమారుడు ఇషాన్‌ సూద్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోనూసూద్‌ తన కుమారుడికి శుభాకాంక్షలు తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ పోస్ట్ చేశారు. ”నా హీరో ఇషాన్ సూద్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఫైనల్‌గా నాకు ఫిట్‌నెస్ విషయంలో పోటీ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు.” అని తెలుపుతూ ఇద్దరూ షర్ట్ లెస్ తో ఉన్న ‌పిక్‌ను సోనూ పోస్ట్ చేశారు. ఇషాన్ చిన్నప్పటి ఫొటో ఇది. ఈ పిక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే నెటిజన్లు అందరూ ఇషాన్ సూద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 17 =