మీతో షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!

Varun Tej Pens A Tweet Saying That He Is Eagerly Looking Forward To Work With Actor Upendra

ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో క‌న్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు ఉపేంద్ర పుట్టిన రోజు కావడంతో ఉపేంద్ర‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పిన వ‌రుణ్ తేజ్‌..ఉపేంద్ర‌తో క‌లిసి సినిమా కోసం ప‌ని చేసేందుకు ఎదురుచూస్తున్న‌ట్టు ట్విట‌ర్ లో పోస్ట్ పెట్టాడు. మరి వ‌రుణ్ తేజ్ ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని రోల్ లో క‌నిపించ‌నుండ‌గా..ఉపేంద్ర ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తాడో చూడాలి.

 

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

ఇక “ఫిదా “, “తొలి ప్రేమ “, “F 2”, “గద్దలకొండ గణేష్ ” ఇలా వరుస హిట్స్ తో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు వరుణ్ తేజ్. మరి ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ ను అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 20 =