అన్నాత్తే.. ‘రజినీ’ కి విలన్ గా..!

jackie shroff to play villain in rajinikanth Annaatthe movie

శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేస్తే ఓ పని అయిపోద్దని భావిస్తున్నారట చిత్రయూనిట్. దీనిలో భాగంగానే త్వరలోనే షూట్ ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అందేంటంటే.. ఈ సినిమాలో రజినీతో తలపడే విలన్ పాత్ర గురించి. రజినీ సినిమా అంటే విలన్ కూడా అదే రేంజ్ లో ఉండాలి కాబట్టి.. ఈ చిత్రంలో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ పాత్ర కావడంతో జాకీ ష్రాఫ్ అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాడని తీసుకున్నారట.

కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి కూడా విదితమే. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేశారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టమనే అర్ధమవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 2 =