క్యూట్ స్మైల్ తో ఇలియానా

Actress Ileana Shares An Adorable Throwback Picture From Her Childhood Days On Instagram

లాక్ డౌన్ వల్ల అందరూ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు దగ్గరగానే వుంటున్నారు. ఇక ఇలియానా కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా తన చిన్ననాటి ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. ఇక చిన్ననాటి ఫొటోలో ఇలియానా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ ఇస్తుంది. ఈ పిక్ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

 

View this post on Instagram

 

Always the derpy dork head in the picture 💁🏻‍♀️ #majorthrowback

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అని చెప్పనక్కర్లేదు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. పోకిరి సినిమాతో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి అప్పట్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఇలియానా. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించి చాలా కాలం పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే అప్పట్లో ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ లో ఉండి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు బ్రేకప్ తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తుంది. గత ఏడాది అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

ప్ర‌స్తుతం ది బిగ్‌బుల్ పేరుతో రూపొందుతున్న ఓ హిందీ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉంది. ఇక తెలుగులో నాగార్జున హీరోగా `గ‌రుడ‌వేగ‌` ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమాలో నాగార్జున స‌ర‌స‌న ఇలియానా న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =