కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 51

సినిమా వార్తలు

మాయాబజార్ 'సీత' కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఎంతో మంది లెజెండ్రీ నటీనటులను కోల్పోగా ఇప్పుడు అలనాటి హీరో నాగభూషణం సతీమణి.. మాయాబజార్ సీత కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కోద్దిరోజులుగా బాధపడుతున్న ఆమె నేడు హైదరాబాద్ లో కన్ను మూసారు. ఇక సీతమ్మ మృతికి చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేశారు. నేడు హైదరాబాద్ మహాప్రస్థానం శ్మశానవాటికలో బంధువులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెప్టెంబర్ 22.. నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు

చిరంజీవి నట ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఇంత స్థాయికి ఎదిగారు కాబట్టి ఎంతో మంది నటీ నటులకు ఆయన స్ఫూర్తి. మొదట కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా పరిచయమై మెగా స్టార్ రేంజ్ కు ఎదిగాడు. ఇక చిరు మొదట నటించిన `ప్రాణం ఖరీదు` సినిమా 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. దీనితో ఈ సినిమాను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేశారు చిరు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ ఫీలింగ్స్

"ఈ నగరానికి ఏమైంది " మూవీ తో గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ యాక్షన్ థ్రిల్లర్ "ఫలక్ నుమా దాస్ " మూవీ తో దర్శకుడిగా మారారు. సూపర్ హిట్ "HIT- ది ఫస్ట్ కేస్ " మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విశ్వక్ సేన్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం "పాగల్ ", "HIT" మూవీ సీక్వెల్" HIT 2" మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక వారంరోజులలో షూటింగ్ లో పాల్గొనే విశ్వక్ సేన్ ఫీలింగ్స్ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మాయాబజార్' లో సినిమాటోగ్రాఫర్ మార్కస్‌ బార్ట్లే 'మాయ'

మాయాబజార్ సినిమా... తెలుగు సినీ చరిత్రలోనే ఇదొక అద్భుత కావ్యం. ఈ సినిమా విడుదలై ఆరు దశాబ్దాలు దాటినా ఇప్పటి తరానికి కూడా ఈ సినిమా పరిచయమే. ఆ తరం నుండి ఈ తరం వరకూ ప్రతి సినీ ప్రేక్షకుడు నచ్చిన.. మెచ్చిన సినిమా ఇది. కె.వి రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్, సావిత్రి, గుమ్మడి వంటి హేమాహేమీలు నటించిన ఈ భారీ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ఆణిముత్యం. శశిరేఖ అనే పాత్రను సష్టించి దాని చుట్టూ అల్లిన కథ ఇది. దుస్తుల దగ్గరనుండి మేకప్ వరకూ ప్రతి విషయాన్ని ఎంతో కూలంకషంగా పరిశీలించి.. ప్రతి చిన్న విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చేశారు కాబట్టే ఈ సినిమా ఇప్పటికీ గుర్తుండిపోతుంది.

TFN Adminవాట్సాప్
'నేచుర‌ల్ యాక్ట్రెస్' కు హ్యాపీ బర్త్ డే
ఫస్ట్ లుక్

'నేచుర‌ల్ యాక్ట్రెస్' కు హ్యాపీ బర్త్ డే

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల రిలీజ్ కాస్త వాయిదా పడింది. ఉప్పెన నుంచి ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌లు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'దృశ్యం 2' మొదలుపెట్టిన మోహన్‌లాల్‌

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. జీతూజోసఫ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయం దక్కించుకుంది. చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సితార తీసిన ఫొటో - ప్రేమ నిజమైంది

టాలీవుడ్ లో ఉన్న వన్ అఫ్ ద పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ కపుల్స్ లో మహేష్ అండ్ నమ్రత పర్ఫెక్ట్ కపుల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక మహేష్ బాబు అయితే ఫుల్ ఫ్యామిలీ పర్సన్. షూటింగ్ లు లేకపోయినా.. షూటింగ్ అయిపోయిన వెంటనే ఇంట్లో వాళ్ళతోనే స్పెండ్ చేస్తాడు. ఇక ఈ లాక్ డౌన్ వల్ల చాలా ఖాళీ టైం దొరికింది. చక్కగా పిల్లలతో ఆట పాటలతో సినిమాలు చూస్తూ జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక వాటికి సంబంధించిన ఫొటోలు కూడా నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో పిక్ పోస్ట్ చేసింది. అయితే ఈ సారి మహేష్ తను వున్న ఫొటో పోస్ట్ చేస్తూ.. ప్రేమపై తనకున్న అవగాహన…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాధ్యతలనుండి పారిపోతున్నా .. బై - ఇలియానా

బ్లాక్ బస్టర్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా "పోకిరి ", "జల్సా ", "కిక్ ", "జులాయి " వంటి సూపర్ హిట్ మూవీస్ లో స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న ఇలియానా బ్లాక్ బస్టర్ "బర్ఫీ " మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. పలు సూపర్ హిట్ హిందీ మూవీస్ లో నటించిన ఇలియానా పూర్తిగా బాలీవుడ్ మూవీస్ పైనే ఫోకస్ పెట్టారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గ్లామర్ అంటే .. లావణ్య త్రిపాఠి

సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "అర్జున్ సురవరం " మూవీ తో సక్సెస్ అందుకున్న లావణ్య ప్రస్తుతం హాకీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కార్తికేయ హీరోగా రూపొందుతున్న "చావు కబురు చల్లగా " మూవీ లో లావణ్య కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సాంగ్

హీరో రవితేజ మూవీ లో కేథరీన్ స్పెషల్ సాంగ్ ?

దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న "క్రాక్ " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత రవితేజ హీరోగా సూపర్ హిట్ "రాక్షసుడు " మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మాతగా ఒక మూవీ తెరకెక్కనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కెమెరాముందుకు వస్తున్నా.. మీ దీవెనలు కావలి..!

నటి, దర్శకురాలిగా, రచయితగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రేణూదేశాయ్. ప్రస్తుతం మెగా ఫోన్ పట్టి ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడింది. రైతు సమస్యలపై ఓ సినిమాను రూపొందిస్తున్నారు రేణు దేశాయ్. ఇప్పటికే ఈ సినిమా కోసం పలువురు రైతులను కలిశారు రేణు దేశాయ్. తాజాగా గోరటి వెంకన్నతో పాట కూడా రాయించుకున్నట్టు తెలిపింది. ఇక ఇదిలా ఉండగా అవకాశం వస్తే మళ్ళీ నటిస్తానని రేణుదేశాయ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల తర్వాత కెమెరా ముందుకు రానున్నట్టు తెలిపింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా 'నిశ్శబ్దం' ట్రైలర్

ఎంతో సస్పెన్స్ తర్వాత 'నిశ్శబ్దం' సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు. రానా దగ్గుబాటి తన ట్విట్టర్‌ ద్వారా ట్రయిలర్ విడుదల చేసి యూనిట్‌ను అభినందనలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ స్టైలిష్ లుక్

"వెళ్ళిపోమాకే " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ "ఈ నాగరానికి ఏమైంది " మూవీ తో గుర్తిపు పొందారు. సక్సెస్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ "ఫలక్ నుమా దాస్ "మూవీ తో విశ్వక్ సేన్ నటుడు గానే కాకుండా దర్శకుడిగా ప్రతిభను చూపారు. ఈ మూవీ లో విశ్వక్ సేన్ ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ "HIT - ది ఫస్ట్ కేస్ " మూవీ లో విశ్వక్ సేన్ పోలిస్ ఆఫీసర్ గా అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'చావు కబురు చల్లగా' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ 'చావు కబురు చల్లగా' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా..త్వ‌ర‌లోనే తిరిగి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించి, శ‌ర‌వేగంగా చిత్రీక‌రణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజు గా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ప్రభాస్ 21' కు మెంటర్ గా సింగీతం శ్రీనివాసరావు

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'అల్లుడు అదుర్స్' కూడా మొదలు

ధైర్యం చేసి టాలీవుడ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు షూటింగ్ లు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది యంగ్ హీరోలు షూటింగ్ కూడా మొదలుపెట్టి పూర్తి చేసారు కూడా. ఇక ఇప్పుడు తాజాగా మరో హీరో సెట్స్ లోకి అడుగుపెట్టేసాడు. కరోనా కారణంగా ఆగిన ఈ షూటింగ్ ను ఈ రోజు నుండి మొదలు పెట్టారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ప్రకాశ్‌ రాజ్‌ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తిచేసి.. ఈ సినిమాను 2021 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. మరి అప్పటిలోపు థియేటర్స్ ఓపెన్ అవుతాయా.. లేకపోతే ముందే ఓపెన్ చేస్తారా చూడాలి..!

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బ్యాక్ టు వర్క్ మోడ్ - రెండు సినిమాలకు పని చేస్తున్నా

ఇటీవలే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కరోనా నుండి కోలుకున్న సంగతి తెలిసిందే. కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం కూడా చేశారు. ఇక అలా రికవర్ అయ్యారో లేదో అప్పుడే వర్క్ మోడ్ లోకి వెళ్లిపోయారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు పలు సినిమాలకు కూడా కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసినిమాల పనిలో ఉన్నట్టు చెపుబుతున్నాడు కీరవాణి. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయ

"ప్రేమతో మీ కార్తీక్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కార్తికేయ సూపర్ హిట్ "RX 100 మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ మూవీ తో కార్తికేయ కు యూత్ లో క్రేజ్ పెరిగింది. "హిప్పీ ", గుణ 369 ", "90 ML " మూవీస్ తో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు. "గ్యాంగ్ లీడర్ " మూవీ లో ప్రతినాయకుడిగా నటించారు. కార్తికేయ ప్రస్తుతం "చావు కబురు చల్లగా " మూవీ లో ఒక మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మూగ అమ్మాయిగా' సమంత..?

గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చిలోనే సెట్స్ పైకి వెళ్ళాలి కానీ లాక్ డౌన్ వల్ల వెళ్ళలేదు. హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత పాత్ర పై ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ లుక్

తెలుగు , తమిళ భాషల స్టార్ హీరోలతో జంటగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో కాజల్ బిజీగా ఉన్నారు. కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య ", తెలుగు , ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హే సనామిక "(తమిళ ), ముంబై సాగా (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్