ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 37
హైదరాబాద్ లో యాక్షన్ స్టార్ యశ్
బెంగళూరులో తెలుగు మూవీస్ హంగామా
సొంత బ్యానర్‌లో నాలుగో సినిమా
మరో మూవీ కి ఇలియానా గ్రీన్ సిగ్నల్
మరో బాలీవుడ్ మూవీలో పూజాహెగ్డే
అధీరా లుక్‌లోకి సంజయ్
'అన్నపూర్ణ స్టూడియోస్' పై వార్తలు నమ్మొద్దు
నితిన్ 'చెక్' మొదలైంది
'మోసగాళ్ళు' తో చేయి కలిపిన వెంకీ
హీరో బాలయ్య కు జోడీ గా మలయాళీ భామ ?
రమేష్ వర్మ సినిమాలో రవితేజకు జోడీగా..?
'ఆద్య' తో వస్తున్న రేణు
నవ సిద్ధుల గుట్టలో "లవ్ స్టోరీ "
వికారాబాద్ అడవుల్లో "విరాటపర్వం "
తమ్ముడికి అభినందనలు - మరో విన్నపం
కె.జి.ఎఫ్2 - నవంబర్ నుండి షూట్ లో సంజయ్ దత్..!
నవంబన్ నుండి వెంకీ కూడా రెడీ
దాదాపు టాలీవుడ్ హీరోలందరూ షూటింగ్ లను మొదలు పెట్టేసారు. యంగ్ హీరోలు అయితే చాలా మంది షూట్ ను మొదలుపెట్టేసారు. కొంతమంది అయితే షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక అగ్ర హీరోల్లో ముందు నాగార్జున షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు షూటింగ్ కోసం విదేశాలకు కూడా వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు మరో అగ్ర హీరో కూడా షూట్ కు రెడీ అయిపోయాడు. ఆ హీరో ఎవరో కాదు వెంకీ.
మాస్ మహారాజ్ తో వర్మ హీరోయిన్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
వరల్డ్ ఫుడ్ డే.. ఏం తింటున్నారో దాన్ని ప్రేమించండి
ఆర్గానిక్ ఫుడ్ తినాలని.. మనకు కావాల్సిన కాయగూరలు ఇంట్లోనే పండించుకొని తినమని ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత కూడా అదే చెపుతుంది. అసలు సంగతేంటంటే ఈరోజు వరల్డ్ ఫుడ్ డే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నమ్రతా శిరోద్కర్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు.
హైదరాబాద్ లో యాక్షన్ స్టార్ యశ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కోలార్ గోల్డ్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ కన్నడ మూవీ "కె జి ఎఫ్ చాప్టర్1 " ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ నిధి శెట్టి హీరోయిన్ కాగా స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో యశ్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హై లైట్ గా నిలిచింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి.
బెంగళూరులో తెలుగు మూవీస్ హంగామా
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ బంద్ అయిన విషయం తెలిసిందే. సుమారు 6 నెలల తరువాత మూవీ షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 15 వ తేదీ నుండి థియేటర్స్ ప్రారంభానికై కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యం లో బెంగళూరు లో కొన్ని థియేటర్స్ అయ్యాయి. సంక్రాంతి పండగకు రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరు ", అల్లు అర్జున్ "అల .. వైకుంఠపురములో .. "నితిన్ "భీష్మ " మూవీస్ బెంగళూరు థియేటర్స్ లో రీ రిలీజ్ అయ్యాయి.
సొంత బ్యానర్‌లో నాలుగో సినిమా
ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు నాగశౌర్య. ఇప్పటికే ఐరా క్రియేషన్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి ఆ బ్యానర్ లోనే ఛలో, నర్తనశాల, అశ్వథ్థామ చిత్రాలను నిర్మించాడు. ఇప్పుడు మరో సినిమాను తన బ్యానర్ లో చేయడానికి రెడీ అయ్యాడు నాగశౌర్య. అంతేకాదు తన బ్యానర్‌లో చేయబోతున్న నాలుగో సినిమాను ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు కూడా.
మరో మూవీ కి ఇలియానా గ్రీన్ సిగ్నల్
బ్లాక్ బస్టర్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించారు. టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉండగానే ఇలియానా సూపర్ హిట్ "బర్ఫీ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ఇలియానా బాలీవుడ్ లో బిజీగా మారారు. ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా రూపొందుతున్న "ది బిగ్ బుల్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మరో బాలీవుడ్ మూవీలో పూజాహెగ్డే
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్ ", మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో పూజాహెగ్డే నటించిన "హౌస్ ఫుల్ 4" మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న "కభీ ఈద్ కభీ దివాలీ " మూవీ కథానాయికగా ఎంపిక అయిన పూజాహెగ్డే మరో బాలీవుడ్ మూవీ కి కథానాయికగా ఎంపిక అయ్యారు.
అధీరా లుక్‌లోకి సంజయ్
తాను చేస్తున్న వృత్తి పట్ల తనకు ఎంత డెడికేషన్, ప్యాషన్ ఉందో అర్ధమవుతుంది బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను చూస్తుంటే. ఎందుకంటే ప్రస్తుతం సంజయ్ దత్ కు ఆరోగ్యం బాలేదన్న సంగతి తెలిసిందే. ఇటీవలే లంగ్ క్యాన్సర్ అని తెలియగా దానికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మరి క్యాన్సర్ ట్రీట్ మెంట్ అంటే చాలా మందికి తెలిసిందే ఎంత వీక్ అయిపోతారో. ఇటీవల సోషల్ మీడియాలో సంజయ్ లుక్ చూసి కూడా చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. ఆయన సన్నగా, కళ్లు లోపలికి పోయి, నీరసంగా కనిపించడంతో అందరూ షాకయ్యారు.
'అన్నపూర్ణ స్టూడియోస్' పై వార్తలు నమ్మొద్దు
అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్టు ఈ రోజు ఉదయం నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమి జరగకపోగా, ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదు.
నితిన్ 'చెక్' మొదలైంది
సినిమా రిలీజ్ లు విషయం పక్కనపెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నితిన్. ప్రస్తుతం నితిన్ రంగ్ దే సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంగింపు దశకు రాగానే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా... ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా `చెక్` యూనిట్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
'మోసగాళ్ళు' తో చేయి కలిపిన వెంకీ
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
హీరో బాలయ్య కు జోడీ గా మలయాళీ భామ ?
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. #NBK106 మూవీ గా రూపొందుతున్న "BB3 "లో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ పాత్రలలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరో బాలకృష్ణ నటించే అఘోరా పాత్ర ఈ మూవీ కి హైలైట్ కానుంది. కరోనా కారణంగా నిలిచిపోయిన"BB3 "మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.
బిగ్ బాస్ 4 ఎమోషన్ తో నిండిపోయిన హౌస్
బిగ్ బాస్ 4- నిజానికి వారంలో మూడు రోజులు అంటే సోమవారం నామినేషన్స్.. ఇంకా మూడు రోజులు కెప్టెన్సీ టాస్క్ అంటూ బిజీగా వుండే హౌస్ మేట్స్ గురువారం.. శుక్రవారం మాత్రం కొంచం ఖాళీగానే ఉంటారు. ఇక వీకెండ్స్ శనివారం.. ఆదివారం అంటే నాగార్జున వస్తాడు.. ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా ఉంటది. ప్రతి వారం లాగే ఈ గురువారం కూడా కొంచం చప్పగానే సాగింది. హౌస్ మొత్తం ఎమోషన్ తో నిండిపోయింది.
రమేష్ వర్మ సినిమాలో రవితేజకు జోడీగా..?
మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి దశకు వచ్చేసింది. ఒక పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
'ఆద్య' తో వస్తున్న రేణు
చాలా ఏళ్ళ తర్వాత రేణు మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు తెలిపింది రేణు. ఈ వెబ్ సిరీస్‌కు నిర్మాతలు డిఎస్. రావు, ఎస్. రజినీకాంత్. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర అందిస్తున్నాడు.
నవ సిద్ధుల గుట్టలో "లవ్ స్టోరీ "
వైవిధ్య భరిత కథా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సి హెచ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "లవ్ స్టోరీ " మూవీ లో నాగచై తన్య , సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం విశేషం.
వికారాబాద్ అడవుల్లో "విరాటపర్వం "
సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ "మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో వాస్తవ సంఘటనల ఆధారంగా "విరాటపర్వం " మూవీ రూపొందుతుంది. రానా , సాయి పల్లవి ఉద్యమకారులుగా నటిస్తున్న ఈ మూవీ లో ప్రియమణి , నందిత దాస్ , నవీన్ చంద్ర , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కరోనా కారణంగా "విరాటపర్వం " మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
తమ్ముడికి అభినందనలు - మరో విన్నపం
సేవా కార్యక్రమాలు చేయడంలో మెగా స్టార్ చిరంజీవి ఎప్పుడు ముందుంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు అందరినీ చేయమని కూడా చెపుతుంటారు. ఇప్పటికే కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు తన ఛారిటీ ద్వారా సాయం అందిస్తున్నాడు. అలాగే తన బ్లడ్ బ్యాంకు ద్వారా ప్లాస్మా దానం చెయ్యాలి అని పిలుపును కూడా ఇచ్చారు. ఇప్పుడు చిరు మరోసారి పిలుపునిస్తున్నారు.
కె.జి.ఎఫ్2 - నవంబర్ నుండి షూట్ లో సంజయ్ దత్..!
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గత కొద్దికాలంగా క్యాన్సర్ కు చికిత్స చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అటు ట్రీట్ మెంట్ తీసుకుంటూనే మరో వైపు షూటింగ్ లకు కూడా హాజరవుతూ దర్శక నిర్మాతలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రస్తుతం శంషెరా చిత్రానికి డబ్బింగ్ చెప్పే పనిలో వున్నాడు. ఇక హిందీలో పలు సినిమాల్లో నటిస్తుండగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కె.జి.ఎఫ్2 లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అధీరా అనే ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.