తమ్ముడికి అభినందనలు – మరో విన్నపం

Megastar Chiranjeevi Applauds His Brother Nagababu For Donating His Plasma For COVID19 Patients

సేవా కార్యక్రమాలు చేయడంలో మెగా స్టార్ చిరంజీవి ఎప్పుడు ముందుంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు అందరినీ చేయమని కూడా చెపుతుంటారు. ఇప్పటికే కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు తన ఛారిటీ ద్వారా సాయం అందిస్తున్నాడు. అలాగే తన బ్లడ్ బ్యాంకు ద్వారా ప్లాస్మా దానం చెయ్యాలి అని పిలుపును కూడా ఇచ్చారు. ఇప్పుడు చిరు మరోసారి పిలుపునిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా బ్రదర్ నాగబాబు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కోలుకున్నారనుకోండి. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేసారు నాగబాబు. ఈ నేపథ్యంలో దీనిపై హీరో తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. కరోనాతో పోరాడి గెలవటమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, ప్లాస్మా దానం చేసిన తమ్ముడు నాగబాబుకి అభినందనలు..ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్నవారికి మరో మారు నా విన్నపం. మీరు ప్లాస్మా చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు.దయచేసి ముందుకు రండి అంటూ పిలుపునిచ్చారు.

 

ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టాలని.. ముందు రామ్ చరణ్ తో వున్న సీన్స్ పూర్తి చేయాలనీ చిత్రయూనిట్ భావిస్తోందట. ఈ సినిమాతో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.