హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ మోసగాళ్లు గ్యాంగ్ తో వెంకీ కూడా జాయిన్ అయ్యారు. అంటే ఈ సినిమాలో వెంకీ కూడా నటిస్తున్నారేమో అనుకుంటున్నారా..? అసలు మ్యాటరేంటంటే… `మోసగాళ్లు` చిత్రానికి సీనియర్ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఈ విషయాన్ని విష్ణు తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఈ సినిమాకు వాయిస్ ఇచ్చిన కూల్ పర్సన్ వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెపుతూ ట్వీట్ చేశారు.
I thank one of the coolest person I know Victory @venkymama for lending his voice for #Mosagallu. Thank you Thank you Thank you ❤️🙏 pic.twitter.com/pLbgtS0HIA
— Vishnu Manchu (@iVishnuManchu) October 16, 2020
కాగా నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: