బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గత కొద్దికాలంగా క్యాన్సర్ కు చికిత్స చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అటు ట్రీట్ మెంట్ తీసుకుంటూనే మరో వైపు షూటింగ్ లకు కూడా హాజరవుతూ దర్శక నిర్మాతలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రస్తుతం శంషెరా చిత్రానికి డబ్బింగ్ చెప్పే పనిలో వున్నాడు. ఇక హిందీలో పలు సినిమాల్లో నటిస్తుండగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కె.జి.ఎఫ్2 లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అధీరా అనే ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో సంజయ్ దత్ నవంబర్ నుండి కేజీఎఫ్ 2 చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్టు తెలిపాడు. ఇప్పటికే కేజీఎఫ్ 2 చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా సంజయ్ దత్ కు సంబంధించి షూట్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు సంజయ్ కాస్త కోలుకోవడంతో షూటింగ్లో తిరిగి పాల్గొనేందుకు సిద్దమయ్యారు. తాజాగా ఓ వీడియో ద్వారా తాను షూటింగ్లో పాల్గొనబోతున్న విషయం తెలిపారు సంజయ్. బాలీవుడ్ ఫేమస్ హైర్ స్టయిలిష్ట్ ఆలిం హకీమ్ వెళ్లిన ఆయన.. హెయిర్ కట్ చేయించుకునేందుకు సెలూన్‌కు తిరిగి రావడం హ్యాపీగా ఉంది. కేజీయఫ్ చాప్టర్ 2 లోని హైర్ స్టైల్ లుక్ ను మరోసారి ప్రిపేర్ చేసి తాను షూట్ కు రెడీ అయ్యినట్టు కన్ఫర్మ్ చేసేసారు. ఇటీవలే యష్ షూట్ లో పాల్గొనగా.. కొన్ని కీలక షాట్స్ ను నీల్ తెరకెక్కించాడు. ఇపుడు సంజయ్ కూడా రెడీ కావడంతో ఈ ఇద్దరి పై మిగిలి ఉన్న షూట్ ను కంప్లీట్ చేయనున్నారు.
ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లతో పాటు తెలుగు నటుడు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: