ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 38
దసరాకు "వకీల్ సాబ్ "మూవీ ట్రీట్ ?
బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!
ఏజెంట్ క్లారిటీ .. 'కొరటాల శివ' తో చెయ్యట్లేదు
సమంత లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్
సాయి తేజ్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు

తలైవి కోసం 20కిలోలు పెరిగా

F2 సీక్వెల్ లో సునీల్..?
గుణశేఖర్ "శకుంతలమ్ "మూవీ విశేషాలు

నవంబర్ లో "విరాటపర్వం " షూటింగ్
బిజీ హీరోయిన్ రీతూవర్మ
హారర్ థ్రిల్లర్ మూవీలో సమంత
ధనుష్, విజయ్‌కాంత్‌కు బాంబు బెదిరింపులు
పూజాహెగ్డే స్టన్నింగ్ లుక్
శోభన్ బాబు బయోపిక్ కు రానా..?
రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హీరో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ కై పలు మూవీస్ వెయిటింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా మూవీస్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ ఒక పాన్ ఇండియా మూవీ లో నటించనున్నారని సమాచారం.
దసరాకు "వకీల్ సాబ్ "మూవీ ట్రీట్ ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ఫిలిమ్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అంజలి , నివేద థామస్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. 6 నెలల తరువాత "వకీల్ సాబ్ "మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. దాదాపుగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న "వకీల్ సాబ్ "మూవీ లో పవన్ కళ్యాణ్ వర్క్ కొంత బ్యాలెన్స్ ఉన్నట్టు సమాచారం.
బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!
మెగా హీరో సాయితేజ్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినిమా ప్రముఖుల నుండి పుట్టిన రోజులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా సాయి తేజ్ కు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే బాయ్ కు విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే బాబాయ్.. యాదృచ్చికంగా బ్లాక్ బస్టర్ 'బిల్లా రంగా' సినిమా కూడా నేటితో 38 ఏళ్ళు పూర్తి చేసుకుంది.. . ఇది మనకు ఏదో చెబుతోంది అనుకుంటున్నా బాబాయ్. నేను రెడీ.. నువ్వు రెడీయా` అని సాయితేజ్ ఫొటో, `బిల్లా రంగా` సినిమా పోస్టర్‌ను మనోజ్ ట్వీట్ చేశాడు. మరి దీనిపై సాయి తేజ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా మంచు మనోజ్, సాయితేజ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.
ఏజెంట్ క్లారిటీ .. 'కొరటాల శివ' తో చెయ్యట్లేదు
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో హీరోగా గుర్తింపు తెచుకున్నాడు. బాలీవుడ్ సినిమా చిచోరేలో కనిపించాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా కనిపించిన ఈ సినిమాలో నవీన్, తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగులో నవీన్ పోలిశెట్టి తన రెండవ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి బ్లాక్ బస్టర్ మహానటి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాస్ బ్యానర్ పై అనుదీప్ దర్శకత్వం లో జాతి రత్నాలు అనే కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
800 పై క్లారిటీ - ఈ సినిమాకు.. రాజకీయాలకు సంబంధం లేదు
శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు విజయ్ సేతుపతి కూడా బౌలింగ్ గురించిన మెళకువలు నేర్చుకుంటున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో ముత్తయ్యగా విజయ్ లుక్ చూసి ఒక రకంగా అందరూ షాకయ్యారు. ముత్తయ్య మురళీధరన్ లుక్ ను దించేశాడు విజయ్
సమంత లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటున్న సమంత ఇప్పుడు దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
సాయి తేజ్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు
ఈ రోజు హీరో సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శ కత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్"సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో సాయి తేజ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.

త్వరగానే కోలుకున్నా - త్వరగా ఇంటికి తిరిగి వస్తా అనుకోలేదు
మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత దాదాపు ఏడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టింది తమన్నా. ఇక్కడికి వచ్చిన దగ్గరనుండి ఆమె ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కరోనా సోకడంతో ఇన్ని రోజులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లోనే చికిత్స తీసుకుంది. ఇక ఇప్పుడు కరోనా తగ్గిపోవడంతో తిరిగి తన హోమ్ టౌన్ ముంబై తిరిగి వెళ్ళిపోయింది.

తలైవి కోసం 20కిలోలు పెరిగా
ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో జయలలిత బాల్యం నుండి సీఎం అయ్యేవరకూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది లాంటి అన్ని విషయాలను చూపించనున్నారు.

బిగ్ బాస్ 4 - రెండోసారి కెప్టెన్ అయిన నోయల్
బిగ్ బాస్ 4.. మంగళవారం మొదలైన కెప్టెన్సీ టాస్క్ నిన్న కూడా కొనసాగింది. మొన్నటి కంటే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంకా కష్టమైన టాస్క్ లు ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక నిన్న ఎపిసోడ్ లో ఏడో డీల్ గా తల, గడ్డం సగం గీసుకోవాలి. అయితే ఈ టాస్క్ మాత్రం రెండు టీమ్స్ చేయమని చెప్పేసరికి బిగ్ బాస్ కూడా క్యాన్సిల్ చేసాడు. ఎనిమిదో డీల్ గా పేడ కలిగిన బాత్‌టబ్‌లో దిగాలి. అఖిల్ గంట మోగించడంతో అతని టీమ్‌లో దివి ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వచ్చింది. తొమ్మిదో డీల్ గా ముఖానికి స్టాకింగ్ వేసుకుని దానిపై నుంచి అరటి పళ్లను తినాలి. అరియానా గంట మోగించడంతో అభిజిత్ ఈ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు…

F2 సీక్వెల్ లో సునీల్..?
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.
గుణశేఖర్ "శకుంతలమ్ "మూవీ విశేషాలు
"లాఠీ " మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన గుణశేఖర్ "సొగసు చూడతరమా " మూవీ తో విజయం సాధించారు. గుణశేఖర్ దర్శకత్వంలో బాల నటీ నటులతో రూపొందిన "రామాయణం "మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన "చూడాలని ఉంది ", "ఒక్కడు ", "రుద్రమదేవి " వంటి మూవీస్ ఘనవిజయం సాధించాయి. "ఒక్కడు "మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా గుణశేఖర్ నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 5 సంవత్సరాల తరువాత గుణశేఖర్ తన కొత్త మూవీ ని అనౌన్స్ చేశారు.

నవంబర్ లో "విరాటపర్వం " షూటింగ్
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో చెరుకూరి సుధాకర్ నిర్మాతగా సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా నక్సలైట్ నేపథ్యంలో వాస్తవ సంఘటన ఆధారంగా "విరాట పర్వం "మూవీ రూపొందుతుంది. ప్రియమణి , నందితా దాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో హీరో రానా , హీరోయిన్ సాయి పల్లవి ఉద్యమ కారులుగా నటిస్తున్నారు.
బిజీ హీరోయిన్ రీతూవర్మ
బ్లాక్ బస్టర్ "బాద్ షా " మూవీ తో నటనకు శ్రీకారం చుట్టిన హైదరాబాద్ అమ్మాయి రీతూవర్మ సూపర్ హిట్ "పెళ్ళిచూపులు " మూవీ తో హీరోయిన్ గా మారారు."పెళ్ళిచూపులు " మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రీతూవర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. "వేల ఇల్ల పట్టాధారి 2 " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రీతూవర్మ "కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితాళ్ "(కనులు కనులను దోచాయంటే ) తమిళ మూవీ తో విజయం సాధించి కోలీవుడ్ లో బిజీగా మారారు.
హారర్ థ్రిల్లర్ మూవీలో సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత నెగటివ్ రోల్ లో నటించిన "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 " వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తి తో సమంత సేంద్రియ పద్ధతి లో పంటలు పండిస్తున్నారు. ఆ పంటల ఫొటోస్ తో అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. సమంత ఇప్పుడు తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .
ధనుష్, విజయ్‌కాంత్‌కు బాంబు బెదిరింపులు
ఈ మధ్య ఏంటో హీరోల ఇంటికి బాంబు బెదిరింపులు వెళ్తున్నాయి. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్, ఇళయదళపతి విజయ్, అజిత్, సూర్య ఇంటిలో బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుస్, విజయ్ కాంత్ ఇండ్లలో బాంబులు పెట్టినట్టు పోలీస్ కంట్రోల్ రూంకు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకు రెండుసార్లు ఫోన్ చేసి చెన్నైలోని అభిరామపురంలో ఉన్న ధనుష్ ఇంటితోపాటు విరుగంబాక్కమ్‌లోని విజయ్ కాంత్ ఇంట్లో బాంబుల పెట్టినట్టు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన నటుల పోలీసులు నటుల ఇళ్ల వద్దకు చేరుకొని గాలింపులు జరిపారు. అక్కడ వారికి ఏమీ…
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి 'శోభానాయుడు' కన్నుమూత
2020 మరో లెజెండ్రీని బలి తీసుకుంది. ఇప్పటికే ఎంతో మంది యువ నటీనటుల దగ్గరనుండి సీనియర్ నటీనటుల వరకూ ఎంతోమంది మృతి చెందారు. రీసెంట్ గానే గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం కూడా కన్నుమూశారు. ఇక ఇప్పుడు తాజాగా మరో గొప్ప డ్యాన్సర్ చనిపోయారు. కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు నేడు తుది శ్వాస విడిచారు. నెలరోజుల క్రితం ఇంటిలో జారిపడటంతో ఆమె తలకు స్వల్ప గాయమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల ఆమెకు కరోనా కూడా సోకడంతో. పది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆమెకు కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. పరిస్థితి…
పూజాహెగ్డే స్టన్నింగ్ లుక్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని , ఈషా రెబ్బా , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు. 6నెలల తరువాత హీరోయిన్ పూజాహెగ్డే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. సంక్రాంతి పండగకు ఈ మూవీ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
శోభన్ బాబు బయోపిక్ కు రానా..?
వెండి తెరపై ఇప్పటివరకూ ఎంతో మంది లెజెండ్రీ నటీనటుల బయోపిక్ లు సందడి చేయడం చూశాం. ఇంకా పలువురి బయోపిక్ లు తెరకెక్కుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ కూడా తెరపైకి వచ్చింది. ఆ బయోపిక్ ఎవరిదో కాదు. తెలుగు సినీ చరిత్రలో సోగ్గాడుగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబుది. . ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఒకరు ఆయన బయోపిక్ ను చేయాలని భావిస్తున్నాడట. అంతేకాదు ఎప్పటినుండో ఈ కథపై పని చేస్తున్నాడట. ఇంకా శోభన్ బాబు కుటుంబసభ్యుల నుండి అనుమతులు కూడా తీసుకున్నారట.
బిగ్‌బాస్ 4 - 'అమీ తుమీ' తేల్చుకుంటున్న హౌస్ మేట్స్
బిగ్ బాస్4- బిగ్ బాస్ 6వ వారంలో అప్పుడే రెండో రోజులు పూర్తయింది. ఇక ముందు మార్నింగ్ మస్తీలో భాగంగా సోహైల్ కిచెన్‌గా మారిపోయాడు. దీంతో అమ్మ రాజశేఖర్ వంట వండుతూ... అతడిని చపాతీలా రుబ్బుతూ.. ఆడుకున్నారు. అవినాష్ బెడ్‌లా మారిపోగా అమ్మ రాజశేఖర్ అతడిపై విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నాడు. అఖిల్ వాష్‌రూమ్‌గా మారిపోగా అవినాష్, అమ్మ రాజశేఖర్ కామెడీ చేసి నవ్వు తెప్పించారు. మోనాల్ తలుపుగా మారిపోగా అందరూ మరోసారి రోబో టాస్కును గుర్తు చేస్తూ డోర్ విరగ్గొట్టేలా విరుచుకుపడ్డారు. దివి కాసేపు డస్ట్‌బిన్‌లా చేసింది. మరోవైపు అభిజిత్ సోహైల్‌కు అందరూ ఇచ్చే సలహానే మళ్లీ గుర్తు చేశాడు. నువ్వు కోపం…