హీరో బాలయ్య కు జోడీ గా మలయాళీ భామ ?

Malayali Actress Prayaga Martin To Pair Opposite Nandamuri Balakrishna In His New Movie Directed By Boyapati Srinu

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “BB3 “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. #NBK106 మూవీ గా రూపొందుతున్న “BB3 “లో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ పాత్రలలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరో బాలకృష్ణ నటించే అఘోరా పాత్ర ఈ మూవీ కి హైలైట్ కానుంది. కరోనా కారణంగా నిలిచిపోయిన”BB3 “మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“BB3 “మూవీకై పలు టైటిల్స్ , పలువురు హీరోయిన్స్ పరిశీలనలో ఉన్నారు. ఇప్పుడు “BB3 “మూవీలో బాలకృష్ణ కు జోడీగా మలయాళీ భామ ప్రగ్య మార్టిన్ ఎంపిక అయ్యారని సమాచారం. సూపర్ హిట్ “పిశాసు ” తమిళ మూవీ తో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ప్రగ్య మలయాళ చిత్ర పరిశ్రమ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. “గీత ” మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయం అయిన ప్రగ్య “BB3 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం కానున్నారు. “సింహా “, “లెజెండ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న “BB3 “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.