బిగ్ బాస్ 4- నిజానికి వారంలో మూడు రోజులు అంటే సోమవారం నామినేషన్స్.. ఇంకా మూడు రోజులు కెప్టెన్సీ టాస్క్ అంటూ బిజీగా వుండే హౌస్ మేట్స్ గురువారం.. శుక్రవారం మాత్రం కొంచం ఖాళీగానే ఉంటారు. ఇక వీకెండ్స్ శనివారం.. ఆదివారం అంటే నాగార్జున వస్తాడు.. ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా ఉంటది. ప్రతి వారం లాగే ఈ గురువారం కూడా కొంచం చప్పగానే సాగింది. హౌస్ మొత్తం ఎమోషన్ తో నిండిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాటతో నిద్రలేచిన హౌస్ మేట్స్ ఎవరి ముచ్చట్లో వారు ఉండిపోయారు. హారిక, నోయల్, అభిజిత్ వేరే కంటెస్టెంట్స్ గురించి కాసేపు చర్చించుకున్నారు. మరోవైపు హైలైట్ ఏంటంటే.. సోహైల్ అరియానాకు సారీ చెప్పాడు. ఇక ఇది చూసిన అవినాష్ ‘అతడు పెడితే తింటావు, కానీ నేను పెడితే తినవు కదా’ అని కామెడీ చేయడంతో తినేసింది.
ఆ తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. స్విమ్మింగ్ ఫూల్‌లోని రియల్ మాంగో బాటిల్స్ తీసుకుని ఎత్తిన బాటిల్ దించకుండా తాగాలి. దానిపై ఏ ఐటెం ఉంటే అది వాళ్లది. హౌస్ మేట్స్ తెలివిగా తమకు కావాల్సిన ఐటమ్స్ ను సెలెక్ట్ చేసుకొని మరీ తాగారు. ఇందులో మెహబూబ్ ఏడు బాటిల్స్ తాగేయగా కుమార్ సాయి ఆరింటిని తాగి టాస్క్ విజయవంతంగా పూర్తి చేశారు.
టాస్క్ అయిపోయిన తర్వాత ఇంటి సభ్యులందరి చిన్ననాటి ఫొటోలను బిగ్‌బాస్ టీవీలో చూపించడంతో కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత అందరికీ ఫొటోఫ్రేములను పంపించగా ఒక్కొక్కరు వారి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక ఆతరువాత రాత్రి పూట కిచెన్‌లో హారిక, లాస్య పిస్తాలు దొంగతనం చేసి తినేశారు. తర్వాత వాటితో గవ్వలాట ఆడారు. అయితే వీరిని దూరం నుంచి చూసిన అఖిల్ ఒక్కసారిగా భయపెట్టాడు. తర్వాత ఈ ముగ్గురినీ నోయల్ భయపెట్టాడు. అంతా కలిసి అక్కడి వస్తువులను లాగించేసారు. ఈ విషయం కనిపెట్టిన దివి కూడా ఆ గ్యాంగ్‌లో చేరి తను కూడా తినేసింది.
మరి చెప్పాలంటే ఎపిసోడ్ కాస్త బోరింగ్ గానే ఉందని చెప్పొచు. మరి వారం తొమ్మిది మంది నామినేషన్ లో ఉన్నారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో.. ఎవరు హౌస్ లో కొనసాగుతారో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: