రమేష్ వర్మ సినిమాలో రవితేజకు జోడీగా..?

మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి దశకు వచ్చేసింది. ఒక పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను ప్రకటించారు కూడా. ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్‌లో సినిమా చేస్తున్నట్టు ప్ర‌ముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఇదిలావుండగా ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్, శీరత్ కపూర్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రీతూ వర్మ. ఇప్పటికే తెలుగులో పలు సినిమాలతో బిజీగా ఉన్నరీతూ వర్మ ఈ సినిమాలో రవితేజకు జోడిగా నటిస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 2 =