చాలా ఏళ్ళ తర్వాత రేణు మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు తెలిపింది రేణు. ఈ వెబ్ సిరీస్‌కు నిర్మాతలు డిఎస్. రావు, ఎస్. రజినీకాంత్. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది రేణు. ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కనున్న ఈ సినిమాలో ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటి- గీతిక రతన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో రేణు రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరాకు ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. డి.ఎస్.కె.స్క్రీన్-సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రావ్.డి.ఎస్- రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ ను తెరకెక్కించనున్నారు. ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్ బాలీవుడ్ హీరో ‘వైభవ్ తత్వవాడి’ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
కాగా నటి, దర్శకురాలిగా, రచయితగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రేణూదేశాయ్. ప్రస్తుతం మెగా ఫోన్ పట్టి ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడింది. రైతు సమస్యలపై ఓ సినిమాను రూపొందిస్తున్నారు రేణు దేశాయ్.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: