
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 160


సూపర్ స్టార్ కృష్ణ `కిరాయి కోటిగాడు`కి 37 ఏళ్ళు

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రవితేజ `క్రాక్`
తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ లు రద్దు..!
ఒక్క సినిమాకే సుకుమార్ సినిమాలో ఛాన్స్..!

పుత్రోత్సహం లో బన్నీ..!
పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో రమ్యకృష్ణ
'కరోనా' కే ఛాలెంజింగ్ గా ప్రభాస్ టీమ్..!
'అరణ్య' పై కూడా 'కరోనా' ఎఫెక్ట్..!
కామెడీ ఎంటర్ టైనర్ గా చిరు-త్రివిక్రమ్ సినిమా..!
ఫ్లాప్ డైరెక్టర్ కి అనుష్క ఛాన్స్..!

2020 విజయదశమికి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్?

హిలేరియస్ ఎంటర్ టైనర్ గా `మెగాస్టార్ 153`?
ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో పూజా హెగ్డే?

మరోసారి మాస్ మహారాజాతో మిల్కీ బ్యూటీ?
`వకీల్ సాబ్`లో `అందాల రాక్షసి`?
నాని "V" మూవీ విడుదల వాయిదా

మహేష్ బాబుతో వెంకీ కుడుముల?
నాగశౌర్య కథానాయకుడిగా నటించిన `ఛలో`(2018)తో దర్శకుడిగా తొలి అడుగేశాడు వెంకీ కుడుముల. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని మూటగట్టుకుని అప్పట్లో వార్తల్లో నిలిచాడు. ఇక రీసెంట్ గా వచ్చిన అతని రెండో చిత్రం `భీష్మ` కూడా సూపర్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో... వెంకీ మూడో చిత్రంపై అందరి దృష్టి పడింది.
కలర్ ఫుల్ సాంగ్ తో `యన్.బి.కె. 106` నెక్స్ట్ షెడ్యూల్
`నారీ నారీ నడుమ మురారి` తరహా గీతాలకు పెట్టింది పేరు నటసింహ నందమూరి బాలకృష్ణ. పలు చిత్రాల్లో ఈ తరహా పాటలతో మాస్ ని ఉర్రూతలూగించారాయన. కట్ చేస్తే.. తన నెక్స్ట్ వెంచర్ లో కూడా ఇలాగే ఇద్దరు నాయికలతో కలసి ఓ మాస్ సాంగ్ లో ఆడిపాడనున్నారట బాలయ్య.

సూపర్ స్టార్ కృష్ణ `కిరాయి కోటిగాడు`కి 37 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో `కిరాయి కోటిగాడు` ఒకటి. మ్యూజికల్ హిట్ గా నిలచిన ఈ మాస్ ఎంటర్ టైనర్ ని ఎ.కోదండరామి రెడ్డి డైరెక్ట్ చేయగా.. రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై యన్. రామలింగేశ్వరరావు నిర్మించారు. రావుగోపాల రావు, అల్లు రామలింగయ్య, శ్రీధర్, ముచ్చర్ల అరుణ తదితరులు ఇందులో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రవితేజ `క్రాక్`
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. `డాన్ శీను`, `బలుపు` చిత్రాల తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా ఇది. శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్స్ లో దర్శనమివ్వనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ లు రద్దు..!
ఒక్క కరోనా ఇప్పుడు ప్రపంచాన్నే కంట్రోల్ చేస్తుంది. ఈ వైరస్ కు భయపడి బయటకు రావాలన్నా.. ఇతరులతో మాట్లాడాలన్నా భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఇప్పటికే 6వేల మందికిపైగా మృతి చెందగా.. లక్షా 80వేలకు పైగా కేసులు ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూశాయి. ఇక్కడితో పోల్చుకుంటే విదేశాల్లో ఈ వ్యాధి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కూడా మన దేశంలో అక్కడక్కడా పలు కేసులు నమోదవ్వడంతో అప్రమత్తమవుతున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే స్కూల్స్, ఆఫీస్ లకు సెలవులు ప్రకటించారు. క్రికెట్ మ్యాచ్ లు సైతం రద్దు చేస్తున్నారు. ఇక సినిమా పరిశ్రమలపై కూడా ఈ ప్రభావం బాగానే పడింది. పదిహేను రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని…
ఒక్క సినిమాకే సుకుమార్ సినిమాలో ఛాన్స్..!
ఇంకా తాను చేస్తున్న సినిమారిలీజ్ కూడా అవ్వలేదు అప్పుడే సుకుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది పూరీ హీరోయిన్. పూరి జగన్నాథ్ నిర్మాణంలో రూపొందుతున్న ‘రొమాంటిక్’ సినిమా ద్వారా కేతిక శర్మ పరిచయమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మొదటి సినిమాలోనే ఈ భామ గ్లామర్ డోస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే విడుదల చేసిన పాటను చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. ఇంకా సినిమా మొత్తం ఎలా ఉంటుందో చూడాలి.
ఆపే ప్రసక్తే లేదు - అవసరమైతే గుడిలో పెళ్ళిచేసుకుంటాం..!
ఏది ఏమైనా పెళ్లి ఆపే ప్రసక్తే లేదు.. అవసరమైతే గుడిలో పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఓ యంగ్ హీరో. ఆ హీరో ఎవరో కాదు... నిఖిల్. భీమవరం కు చెందిన డాక్టర్ పల్లవి వర్మ తో గత నెల ఫిబ్రవరి 1వ తేదీన నిఖిల్ నిశ్చితార్ధం పెద్దల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇంకా పెళ్లి ముహుర్తాన్ని ఏప్రిల్ 16 వ తేదీకి ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ పెళ్లి జరుగుతుందా?లేదా?అన్న డౌట్ లు మొదలయ్యాయి. ఇప్పటికే ఇదే డేట్ లో ఉన్న నితిన్ పెళ్లి డేట్ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

పుత్రోత్సహం లో బన్నీ..!
ఎంత సినిమాల్లో బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటాడు. అంతేకాదు తన కూతురు అర్హ తో అప్పుడప్పుడు క్యూట్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పంచుకుంటాడు. అక్కడే మనం అర్ధం చేసుకోవచ్చు ఫ్యామిలీ తో పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేస్తాడని. తాజాగా బన్నీ తన ముద్దుల కొడుకు అల్లు అయాన్ ని ఉద్దేశించి ట్వీట్ చేసి ... మరోసారి తన పిల్లలపై ఉన్న ప్రేమను తెలియజేశాడు.
పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో రమ్యకృష్ణ
తెలుగు, తమిళ , కన్నడ, మలయాళ, హిందీ భాషల చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన రమ్యకృష్ణ , దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ "బాహుబలి", "బాహుబలి 2" మూవీస్ లో శివగామి పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. బాహుబలి మూవీ తరువాత దర్శకులు రమ్యకృష్ణ కై ప్రత్యేక పాత్రలు రూపొందిస్తున్నారు.
'కరోనా' కే ఛాలెంజింగ్ గా ప్రభాస్ టీమ్..!
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఎక్కువగా వినిపించే పేరు 'కరోనా'. ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది ఈ కరోనా. చైనా పుట్టిన ఈ మహమ్మారి వైరస్.. చిన్నగా పలు దేశాల్లో వ్యాపిస్తుంది. దీనితో జనాలు బయట తిరగడం మానేశారు. స్కూళ్ళు, ఆఫీస్ లకు సెలవలు ప్రకటించారు. ఇక సినీ పరిశ్రమలు కూడా తమ షూటింగ్ లను ఆపేసుకుంటున్నాయి. థియేటర్స్ మూసేయడంతో సినిమాల రిలీజ్ లను వాయిదా వేసుకుంటున్నారు. అంతేకాదు కరోనా వల్ల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ మరియు ఆంధ్ర షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.
'అరణ్య' పై కూడా 'కరోనా' ఎఫెక్ట్..!
కరోనా ఎఫెక్ట్ కు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక్కడా కూడా జనాలు థియేటర్స్ కు వెళ్లకపోవడంతో.. చాలా థియేటర్స్ వెల వెల బోతున్నాయి. ఇక చేసేది లేక రిలీజ్ కావాల్సిన సినిమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు పలు సినిమాల దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్వకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'వి' సినిమాను వాయిదా వేశారు. నిజానికి ఈ సినిమా ఉగాదికి అంటే ఈ నెల 25న(మార్చి25) విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ... త్వరలోనే మరో విడుదల తేదీని రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
కామెడీ ఎంటర్ టైనర్ గా చిరు-త్రివిక్రమ్ సినిమా..!
ఈ సారి మాత్రం ఫుల్ పక్కా కామెడీ ఎంటర్టైనర్ తో రావడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది మెగా స్టార్ చిరంజీవి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కామెడీ జోనర్ ను ట్రై చేయలేదు చిరు. మొదటి సినిమా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాగా రెండో సినిమా సైరా ఫ్రీడమ్ ఫైటర్ సినిమా... ఇప్పుడు కొరటాల తో చేస్తున్న సినిమాలో కూడా కామెడీ లేనట్టుగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్టైనర్ ను తీయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.
ఫ్లాప్ డైరెక్టర్ కి అనుష్క ఛాన్స్..!
ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్స్ కే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు లేక వెనకపడ్డారు. దానికి కారణం వరుస ఫ్లాప్స్ వెంటాడమే కారణం. పూరీ కాస్త ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చాడు. అలాంటిది ఇప్పుడొక డైరెక్టర్ ఒక్క సినిమాతో.. అది కూడా ప్లాప్ సినిమా తీసి ఇప్పుడు ఏకంగా అనుష్క తో చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు... సందీప్ కిషన్, రెజినా కాసాండ్రా జంటగా 2014లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రా రా కృష్ణయ్య డైరెక్టర్ మహేష్. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక దాదాపు ఆరేళ్ళ తరువాత ఆయన అనుష్క శెట్టిని కలిసి తన స్టోరీ లైన్ తో…

2020 విజయదశమికి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్?
ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు చిత్రాలు సందడి చేయగా... వాటిలో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో.. రాబోయే దసరా సీజన్ పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ విజయదశమి బరిలో దిగుతున్నట్లు తెలిసింది.

హిలేరియస్ ఎంటర్ టైనర్ గా `మెగాస్టార్ 153`?
`ఖైదీ నంబర్ 150`తో గ్రాండ్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆపై పేట్రియాటిక్ డ్రామా`సైరా నరసింహారెడ్డి`లో నటించారు. ఈ రెండింటిలోనూ సీరియస్ రోల్స్ లోనే కనిపించారు చిరు. అంతేకాదు.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సోషల్ డ్రామా `ఆచార్య`లోనూ అదే శైలి పాత్రని పోషిస్తున్నారాయన.
ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో పూజా హెగ్డే?
ఒకవైపు గ్లామర్ రోల్స్ లో మురిపిస్తూనే.. మరోవైపు పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లోనూ అలరిస్తోంది పూజా హెగ్డే. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న ఈ స్టన్నింగ్ బ్యూటీ.. త్వరలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో నటించబోతోందట.

మరోసారి మాస్ మహారాజాతో మిల్కీ బ్యూటీ?
`బెంగాల్ టైగర్` (2015) చిత్రంలో తొలిసారి జంటగా నటించి అలరించారు మాస్ మహారాజా రవితేజ, మిల్కీ బ్యూటీ తమన్నా. కట్ చేస్తే.. ఐదేళ్ళ తరువాత ఈ ఇద్దరు మరోమారు జోడీకట్టబోతున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. `సినిమా చూపిస్త మావ`, `నేను లోకల్` చిత్రాల దర్శకుడు త్రినాథరావ్ నక్కిన డైరెక్షన్ లో రవితేజ ఓ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ చేయనున్నాడు. మే నుండి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజకి జోడీగా తమన్నా నటిస్తుందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే తమన్నా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
`వకీల్ సాబ్`లో `అందాల రాక్షసి`?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్ మూవీ`పింక్` ఆధారంగా రూపొందుతున్న ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామాని బోనీకపూర్ సమర్పణలో `దిల్` రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తుండగా... ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ లో మరో ఇద్దరు నాయికలు కనిపిస్తారట. అందులో ఒకరిగా శ్రుతి హాసన్ పేరు వినిపిస్తుండగా... మరొకరిగా `అందాల రాక్షసి` ఫేమ్ లావణ్య త్రిపాఠి దర్శనమివ్వనుందని సమాచారం. త్వరలోనే శ్రుతి, లావణ్య ఎంట్రీపై…
నాని "V" మూవీ విడుదల వాయిదా
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నాని, సుధీర్ బాబు హీరోలుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. నివేత థామస్, అదితి రావు హైదరీ కథానాయికలు. జగపతి బాబు, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్యపాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం, థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
బిగ్ బాస్ సీజన్ 4 కు నాగార్జున వ్యాఖ్యాత ?
స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో 3సీజన్ లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకొన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4కు వ్యాఖ్యాతగా పలువురు పేర్లు వినిపించాయి. ఎటువంటి కాంట్రవర్సీటీ లు లేకుండా బిగ్ బాస్ సీజన్ 3 ను హుందాగా, జోవియల్ గా నడిపించిన నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 కు వ్యాఖ్యాత గా ఉంటారని సమాచారం.