ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 159

#Prabhas 20 షూటింగ్ షెడ్యూల్ పై దర్శకుడి వివరణ
అభిమానులకు రామ్ చరణ్ మనవి

విక్టరీ వెంకటేష్ `రాజా`కి 21 ఏళ్ళు

నాగశౌర్యతో నందినీరెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్?

రామ్ తో రాజమౌళి చిత్రం?

దుల్కర్ సల్మాన్ తో హను రాఘవపూడి చిత్రం?

హిందీ బాట పడుతున్న `వరల్డ్ ఫేమస్ లవర్`?
'ఆర్ఆర్ఆర్' - అలియా జాయిన్ అయ్యేది అప్పుడే..!

సీనియర్ హీరోతో సమంత..!
విద్యా సంస్థల వార్షికోత్సవం వాయిదా

'కరోనా' పై మహేష్ ఇంట్రెస్టింగ్ వీడియో

కరోనా వైరస్ పై మహేష్ బాబు స్పందన

#Prabhas 20మూవీ అప్ డేట్

మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ లో అనుష్క ?

'కరోనా' బారిన పడకుండా ఎన్టీఆర్, చరణ్ సూచనలు
GMB ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెబ్ సిరీస్?
టాలీవుడ్ లో సక్సెసఫుల్ హీరో గా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ బ్యానరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ భాగస్వామ్యంలో రూపొందిన శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు మూవీస్ ఘనవిజయం సాధించాయి. జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా "మేజర్ "మూవీ రూపొందుతుంది.
'వకీల్ సాబ్' లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన లావణ్య త్రిపాఠి..!
హిందీలో అమితాబ్ ప్రధాన పాత్రలో తాప్సి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా పింక్. స్త్రీ స్వేచ్చ, హక్కులపై న్యాయ వ్యవస్థపై ముగ్గురు యువతులు ఎలా పోరాటం చేశారు..వారికి అమితాబ్ ఎలా సాయం అన్నది ఈ సినిమా కథాంశం. ఇక హిందీలో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. తమిళ్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే తమిళ్ లో కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారనుకోండి. తెలుగులో కూడా ఎదో మెసేజ్ ఇచ్చాం అన్నట్టుగా కాకుండా కమర్షియల్ అంశాలు జోడించనున్నారు. అయితే ఒరిజినల్ కథ ఫ్లేవర్ పోకుండా.. మరి ఎక్కువ హీరోయిజం చూపించకుండా... తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కథలో భాగంగానే హీరోని చూపించాలని ప్లాన్ చేస్తున్నారు.

#Prabhas 20 షూటింగ్ షెడ్యూల్ పై దర్శకుడి వివరణ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకున్న #Prabhas20 మూవీ జార్జియా లో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కాలేదని, షూటింగ్ క్యాన్సిల్ అయిందనే రూమర్స్ కు దర్శకుడు రాధాకృష్ణ చెక్ పెట్టారు.
అభిమానులకు రామ్ చరణ్ మనవి
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తం గా జన జీవనం అస్తవ్యస్తమయింది. కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంది. ఇప్పటికే నిర్మాతలు మూవీ రిలీజ్ లు, షూటింగ్స్ రద్దుచేశారు. టాలీవుడ్ ప్రముఖులు ఎటువంటి వేడుకలు నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నారు.

విక్టరీ వెంకటేష్ `రాజా`కి 21 ఏళ్ళు
విక్టరీ వెంకటేష్, అభినేత్రి సౌందర్య కాంబినేషన్ లో పలు మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. వాటిలో `రాజా` ఒకటి. తమిళ చిత్రం `ఉన్నిడత్తిల్ ఎన్నై కొడుత్తేన్` (కార్తిక్, రోజా) ఆధారంగా తెరకెక్కిన ఈ రీమేక్ మూవీని ముప్పలనేని శివ తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో అబ్బాస్, సుధాకర్, చంద్రమోహన్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణ, వై.విజయ, సన తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

నాగశౌర్యతో నందినీరెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్?
`అలా మొదలైంది`(2011)తో దర్శకురాలిగా తొలి అడుగేసింది నందినీ రెడ్డి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నందిని.. ఆపై `జబర్ దస్త్`, `కళ్యాణ వైభోగమే`, `ఓ బేబీ` చిత్రాలతో పలకరించింది. వీటిలో `జబర్ దస్త్` మినహా మిగిలిన రెండు సినిమాలు కూడా విజయతీరాలకు చేరుకున్నాయి.

రామ్ తో రాజమౌళి చిత్రం?
తెలుగునాట అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్పటివరకు ఆయన 11 చిత్రాలను డైరెక్ట్ చేయగా... ప్రతీ సినిమా విజయఢంకా మ్రోగించింది. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్.. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో పేట్రియాటిక్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`ని తెరకెక్కిస్తున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దుల్కర్ సల్మాన్ తో హను రాఘవపూడి చిత్రం?
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా తెరంగేట్రం చేసినా.. అనతి కాలంలోనే నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. కేవలం మాతృభాషకే పరిమితం కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశాడు. తెలుగులో మహానటి సావిత్రి బయోపిక్ `మహానటి`లో జెమినీ గణేషన్ గా నటించి అలరించాడు. ఆపై మళ్ళీ తెలుగులో నేరుగా నటించని దుల్కర్ త్వరలో మరోమారు టాలీవుడ్ బాట పట్టనున్నాడట.

హిందీ బాట పడుతున్న `వరల్డ్ ఫేమస్ లవర్`?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ మూడు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ రూపొందించిన ఈ సినిమాలో విజయ్ కి జోడీగా రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లి లిటే నాయికలుగా నటించారు. గోపీసుందర్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించింది. వేలంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న రిలీజైన ఈ ప్రేమకథా చిత్రం... కంటెంట్ విషయంలో ఓకే అనిపించుకున్నా, ఎగ్జిక్యూషన్ విషయంలో పూర్ మార్క్స్ తెచ్చుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందీ సినిమా.
'ఆర్ఆర్ఆర్' - అలియా జాయిన్ అయ్యేది అప్పుడే..!
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గత కొద్దికాలంగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా...కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక ఇప్పటివరకూ ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించినంత వరకూ షూటింగ్ ను జరుపుకోగా.... అలియా మే నుండి షూటింగ్ ను లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగిలిన పాత్రలకు సంబంధించి పోర్షన్…

సీనియర్ హీరోతో సమంత..!
టాలీవుడ్ లో స్టార్ ప్లస్ లక్కీ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సమంత. ఏం మాయ చేసావే సినిమాతో అరంగేట్రం చేసిన సమంత ఆ తర్వాత వెనక్కి తిరిగిచుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో చేసి ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళైన తర్వాత వరుసగా హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉంది. అయితే పెళ్ళైన తర్వాత సమంత తన రూట్ ను మార్చేసింది. కేవలం పాత్ర ప్రధానమైన... లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తుంది. ‘యు టర్న్’, ‘ఓ బేబీ’ చిత్రాలు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌ని ఒంటి చేత్తో నడిపించగలిగే సత్తా సమంతకు ఉందని ప్రూవ్ చేసాయి.
విద్యా సంస్థల వార్షికోత్సవం వాయిదా
విలక్షణ నటుడు మోహన్ బాబు 1992 సంవత్సరంలో తిరుపతి లో శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలు ప్రారంభించిన విషయం తెలిసిందే. మోహన్ బాబు బర్త్ డే రోజు మార్చి 19వ తేదీ ప్రతీ సంవత్సరం విద్యా సంస్థల వార్షికోత్సవం జరుగుతుంది. 27 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూనే ఉంది. 40వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు విద్య ను అందిస్తున్న విద్యా సంస్థల వార్షికోత్సవం కరోనా వైరస్ కారణంగా వాయిదాపడింది.

'కరోనా' పై మహేష్ ఇంట్రెస్టింగ్ వీడియో
'కరోనా' పై ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ స్పందించి ప్రజలకు పలు సూచనలు చెప్పడంతోపాటు... అనవసరమైన అపోహలకు భయపడకుండా ఉండాలని ధైర్యాన్ని కూడా నింపుతున్నారు. ఇప్పుడు మహేష్ కూడా తన వంతుగా కొన్ని సూచనలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ''ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో.. సమాజానికి కాస్త దూరంగా ఉండటమే మంచిదని... సామాజిక జీవనాన్ని త్యాగం చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. మీ కుటుంబసభ్యులతో కలిసి ఎక్కువసమయం ఇంటిపట్టునే ఉండడం ద్వారా ఈ దశను అధిగమిద్దాం. ఇలా చేయడం ద్వారా వైరస్ మరింత వ్యాపించకుండా చేసి, మరిన్ని ప్రాణాలను కాపాడిన వాళ్లమవుతాం. పరిసరాలను శుభ్రంగా ఉంచండి, తరచుగా మీ చేతులను శుభ్రంగా…

కరోనా వైరస్ పై మహేష్ బాబు స్పందన
కరోనా వైరస్ కార్చిచ్చులా వ్యాపిస్తూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ భారీ ధన, ప్రాణ నష్ఠాలను కలుగజేస్తుంది. చిత్ర పరిశ్రమ నే కాకుండా పలు వాణిజ్య సంస్థలకు కూడా భారీగా నష్టం కలిగేలా చేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామజిక దూరం పాటించాలని మహేష్ బాబు ప్రజలను కోరారు.

#Prabhas 20మూవీ అప్ డేట్
గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas20 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్, భారీ సెట్స్ లో రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. జార్జియా లో జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో ఒక ఛేజ్ సీన్ ను, ప్రభ, పూజ హెగ్డే లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు.

మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ లో అనుష్క ?
ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా స్టార్ హీరోయిన్ అనుష్క స్థానం పదిలం గానే ఉంది. అరుంధతి, బాహుబలి, బాహుబలి 2, రుద్రమదేవి, భాగమతి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అనుష్క ఇప్పుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం" తో ప్రేక్షకులను అలరించనున్నారు. 15 సంవత్సరాల సినీ కెరీర్ ను అనుష్క కంప్లీట్ చేసుకున్నారు.

సుకుమార్ తో మరో ఛాన్స్ కొట్టేసిన 'ఉప్పెన' హీరోయిన్..!
ఒక పక్క పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే... మరోపక్క చిన్న హీరోలకు కథలను అందిస్తూ తన నిర్మాణ సంస్థలోనే సినిమాలు తెరకెక్కిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉప్పెన సినిమా లైన్ లో ఉంది. సుకుమార్ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ అమ్మడికి సుకుమార్ మరో సినిమాలో నటించే అవకాశం దక్కినట్టు…

'కరోనా' బారిన పడకుండా ఎన్టీఆర్, చరణ్ సూచనలు
అప్పుడెప్పుడో ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ అప్పుడు చూశాం ఎన్టీఆర్, రామ్ చరణ్ ను ఒకేసారి. మళ్ళీ ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఒకేసారి చూసే అవకాశం కలిగింది. కరోనా వైరస్ వీరిద్దరినీ ఒకేసారి చూసే అవకాశాన్ని కల్పించింది. కరోనా వల్ల ఇప్పటికే విదేశాల్లో షూటింగ్ లకు బ్రేక్ లు వేసాయి పలు సినిమాలు. అందులో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ చెప్పి రెస్ట్ తీసుకుంటున్నారు.

ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుపమ పరమేశ్వరన్?
అందం, అభినయాల మేళవింపుగా నిలచిన కథానాయికల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. దక్షిణాదిన అన్ని భాషల సినిమాల్లోనూ నటించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... తెలుగునాట ఒక దశలో వరుస విజయాలు చూసింది. ఆ మధ్య కెరీర్ కాస్త ట్రాక్ తప్పినట్టు అనిపించినా.. `రాక్షసుడు`తో మళ్ళీ విజయపథంలోకి వచ్చేసింది.
టైగర్ ష్రాఫ్ ను రిక్వెస్ట్ చేస్తున్న అల్లు అయాన్..!
మొత్తానికి అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్ కూడా చిన్నప్పటినుండే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. ఒకపక్క అల్లు అర్జున్ తన పాటలతో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే.. మరో పక్క పిల్లలు అర్హ, అయాన్ తమ క్యూట్ వీడియోస్ తో ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. అర్హ, అయాన్ వీడియోస్ ఏమున్నా వెంటనే అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాడు. అర్హ, బన్నీ వీడియోస్ అయితే అలా బయటికి వచ్చిన వెంటనే కొద్దినిమిషాల్లోనే వైరల్ గా మారుతున్నాయి. ఇక తాజాగా మరో వీడియో ను పోస్ట్ చేసాడు బన్నీ.