శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నాని, సుధీర్ బాబు హీరోలుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. నివేత థామస్, అదితి రావు హైదరీ కథానాయికలు. జగపతి బాబు, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్యపాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం, థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా వైరస్ కారణంగా “V” మూవీ విడుదల వాయిదా పడింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచం అల్లకల్లోలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమ పై కూడా పడింది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రజలు థియేటర్స్ కు వెళ్ళడానికి భయపడుతున్నారు. కొన్ని రాష్ట్రాలలో థియేటర్స్ మూసివేశారు. కరోనా వైరస్ కారణంగా “V” మూవీ విడుదల వాయిదా వేస్తున్నట్టు గా చిత్ర యూనిట్ ఈ రోజు ప్రకటించింది. కొన్ని రోజుల తరువాత విడుదల తేదీ ని ప్రకటించనున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: