మ‌హేష్ బాబుతో వెంకీ కుడుముల‌?

Mahesh Babu To Work With Bheeshma Movie Director Venky Kudumula

నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఛ‌లో`(2018)తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేశాడు వెంకీ కుడుముల‌. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుని అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచాడు. ఇక రీసెంట్ గా వ‌చ్చిన అత‌ని రెండో చిత్రం `భీష్మ‌` కూడా సూప‌ర్ స‌క్సెస్ అయింది. ఈ నేప‌థ్యంలో… వెంకీ మూడో చిత్రంపై అంద‌రి దృష్టి ప‌డింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొద్దిరోజుల క్రితం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో వెంకీ నెక్స్ట్ వెంచ‌ర్ ఉంటుంద‌ని క‌థ‌నాలు వ‌చ్చినా… క్లారిటీ రాలేదు. ఈ క్ర‌మంలో… ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే… సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నుంచి వెంకీ కుడుములకు పిలుపు వ‌చ్చింద‌ని… ఓ మంచి క‌థ సిద్ధం చేసుకోమ‌ని మ‌హేష్ చెప్పార‌ని స‌మాచారం. మ‌రి… ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో తెలియ‌దో కానీ… మూడో సినిమాతోనే మ‌హేష్ ని డైరెక్ట్ చేసే అవ‌కాశం వస్తే గ‌నుక వెంకీ కుడుముల‌కి ఇది బంప‌ర్ ఆఫ‌ర్ అనే చెప్పాలి. త్వ‌ర‌లోనే మ‌హేష్, వెంకీ కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.