ఆపే ప్రసక్తే లేదు – అవసరమైతే గుడిలో పెళ్ళిచేసుకుంటాం..!

No Postponement Of Wedding Says Actor Nikhil Siddharth,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Nikhil Siddharth,Nikhil Siddharth Latest News,No Postponement Of Marriage Says Hero Nikhil Siddharth,Nikhil Siddharth Marriage Details,Nikhil Siddharth Wedding Live Updates

ఏది ఏమైనా పెళ్లి ఆపే ప్రసక్తే లేదు.. అవసరమైతే గుడిలో పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఓ యంగ్ హీరో. ఆ హీరో ఎవరో కాదు… నిఖిల్. భీమవరం కు చెందిన డాక్టర్ పల్లవి వర్మ తో గత నెల ఫిబ్రవరి 1వ తేదీన నిఖిల్ నిశ్చితార్ధం పెద్దల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇంకా పెళ్లి ముహుర్తాన్ని ఏప్రిల్ 16 వ తేదీకి ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ పెళ్లి జరుగుతుందా?లేదా?అన్న డౌట్ లు మొదలయ్యాయి. ఇప్పటికే ఇదే డేట్ లో ఉన్న నితిన్ పెళ్లి డేట్ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ వార్తలపై స్పందించిన నిఖిల్‌.. ఏప్రిల్ 16న జ‌ర‌గ‌బోయే మా పెళ్లిని క‌రోనా గాని ఇంక వేరేది ఏది గాని ఆప‌లేదు. ఒక‌వేళ ఏవైన అడ్డంకులు వ‌స్తే.. మేమిద్ద‌రం గుడికి వెళ్లి వివాహం చేసుకుంటాం. అంతేకాని పెళ్లిని పోస్ట్ పోన్ చేయ‌మ‌ని నిఖిల్ స్పష్టం చేశాడు. జీవితంలో పెళ్లి అనేది ఎవరికైనా ఓ గొప్ప ఫీలింగ్. ఇప్పటికే ఈ నెలలో జరగాల్సిన బ్యాచ్‌లర్ పార్టీ, ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలను వాయిదా వేసుకొన్నాం. అనుకొన్న తేదీకే పెళ్లి జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు అని నిఖిల్ తెలిపాడు. మరి నిఖిల్ అయితే క్లారిటీ ఇచ్చేసాడు.. నితిన్ కూడా ఏదిఏమైనా పెళ్లి చేసుకుంటాడా..? లేక నిఖిల్ లాగా సింపుల్ గా కనిచేస్తాడా..? చూద్దాం ఏం నిర్ణయం తీసుకుంటాడో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.