ఒక్క కరోనా ఇప్పుడు ప్రపంచాన్నే కంట్రోల్ చేస్తుంది. ఈ వైరస్ కు భయపడి బయటకు రావాలన్నా.. ఇతరులతో మాట్లాడాలన్నా భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఇప్పటికే 6వేల మందికిపైగా మృతి చెందగా.. లక్షా 80వేలకు పైగా కేసులు ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూశాయి. ఇక్కడితో పోల్చుకుంటే విదేశాల్లో ఈ వ్యాధి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కూడా మన దేశంలో అక్కడక్కడా పలు కేసులు నమోదవ్వడంతో అప్రమత్తమవుతున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే స్కూల్స్, ఆఫీస్ లకు సెలవులు ప్రకటించారు. క్రికెట్ మ్యాచ్ లు సైతం రద్దు చేస్తున్నారు. ఇక సినిమా పరిశ్రమలపై కూడా ఈ ప్రభావం బాగానే పడింది. పదిహేను రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లు మూసి వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో సినిమా రిలీజ్ డేట్ లు కూడా వాయిదా వేసుకుంటున్నారు. పలు సినిమాలు కూడా షూటింగ్ లు రద్దుచేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ మరియు ఆంధ్ర షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్,మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి ఈ విషయాన్ని తెలియజేసారు.
ఈ సందర్భంగా నారాయన దాస్ నారగ్ మాట్లాడుతూ…
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ మరియు ఆంధ్ర షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాధి కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ సహకరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు.
నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ…
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తీసుకున్న నిర్ణయం ఇది. థియేటర్స్ బంద్ తో పాటు, షూటింగ్ కూడా నిలిపివేయలనేది మా నిర్ణయంగా భావుస్తున్నాం. తెలంగాణ నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాము, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరం లేని ఆంధ్ర ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు.
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ…
సోషల్ రెస్పాన్సిబులిటీ తో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అందరూ కలిసి దీన్ని సమర్ధిస్తున్నాము. షూటింగ్స్ సమయంలో వందల మంది పాల్గొంటారు వారి ఆరోగ్య దృస్థ్య ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ లు దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, నట్టి కుమార్, ట గుర్ మధు, రామా సత్యన్నారాయణ, సురేందర్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: