‘కరోనా’ కే ఛాలెంజింగ్ గా ప్రభాస్ టీమ్..!

Prabhas Team Challenges Coronavirus

ప్రస్తుతం ఎక్కడ విన్నా ఎక్కువగా వినిపించే పేరు ‘కరోనా’. ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది ఈ కరోనా. చైనా పుట్టిన ఈ మహమ్మారి వైరస్.. చిన్నగా పలు దేశాల్లో వ్యాపిస్తుంది. దీనితో జనాలు బయట తిరగడం మానేశారు. స్కూళ్ళు, ఆఫీస్ లకు సెలవలు ప్రకటించారు. ఇక సినీ పరిశ్రమలు కూడా తమ షూటింగ్ లను ఆపేసుకుంటున్నాయి. థియేటర్స్ మూసేయడంతో సినిమాల రిలీజ్ లను వాయిదా వేసుకుంటున్నారు. అంతేకాదు కరోనా వల్ల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ మరియు ఆంధ్ర షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఒక హీరో మాత్రం ఇవేమి పట్టించుకోకుండా.. తన షూటింగ్ ను తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు.. మన బాహుబలి ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ గత కొద్దికాలం క్రిందటే పాల్గొన్నాడు. ప్రస్తుతం జార్జియాలో ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అక్కడ 10 డిగ్రీల చలిలో…దీనికి తోడు వాన కురుస్తున్నా ఇవేమి పట్టించుకోకుండా షూటింగ్ చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఇది బాగానే ఉన్నా ఈ టైం లో అంతే రిస్క్ చేయడం అవసరమా అంటున్నారు ఫ్యాన్స్. ఇక్కడ కంటే అక్కడే.. అలాంటి వాతారణంలోనే ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి టైం లో షూటింగ్ ఏం అవసరం లేదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్యాన్‌ ఇండియన్‌ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + three =